ETV Bharat / state

నేడు ఈసెట్ పరీక్ష... కరోనా కాలంలో తొలి పరీక్ష - తెలంగాణ ఈ-సెట్ పరీక్ష

కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో వాయిదా పడిన పరీక్షలను ఒక్కొక్కటిగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఈసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమో, బీఎస్సీ పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలోకి ప్రవేశం కల్పిస్తారు.

Today Telangana Ecet Exam Start
నేడు ఈసెట్ పరీక్ష... కరోనా కాలంలో తొలి పరీక్ష
author img

By

Published : Aug 31, 2020, 3:43 AM IST

నేడు ఈసెట్‌తో రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు మొదలు కానున్నాయి. పాలిటెక్నిక్ డిప్లొమా చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే.. ఈసెట్ కోసం జేఎన్​టీయూహెచ్ సర్వం సిద్ధం చేసింది. కరోనా పరిస్థితులతో పలు మార్లు వాయిదా పడిన ఈసెట్... ఇవాళ ఆన్‌లైన్ విధానంలో రెండు పూటలు జరగనుంది.

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు... మద్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు పరీక్ష జరగనుంది. ఈసెట్ కోసం తెలంగాణలో 52, ఏపీలో 4 కేంద్రాలను సిద్ధం చేశారు. మొత్తం 28 వేల 15 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి పరీక్ష కేంద్రాల్లోకి మంచినీటి బాటిల్, శానిటైజర్, గ్లౌజులు, మాస్కును అనుమతించనున్నారు.

ఇదీ చూడండి: కేసీఆర్​ గణపతి పూజ.. మనవడు హిమాన్షు ఏం చేశాడంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.