ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ పుట్టినరోజుని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం, తెరాస తరపున భారీ సంఖ్యలో మొక్కలు నాటనున్నారు. కేసీఆర్ పుట్టినరోజున ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పురపాలకశాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు.. మొక్కలు నాటేందుకు రంగం సిద్ధం చేశారు.
మంత్రులు స్వయంగా మొక్కలు నాటడంతోపాటు.. తమ శాఖల వారీగా లక్ష్యాలను నిర్ధేశించారు. ఆయా శాఖల్లోని అధికారులు, సిబ్బంది వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటనున్నారు. పార్టీ నేతలు, శ్రేణులతోపాటు వివిధ సంఘాలు, సంస్థలు మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు.
ఇవీ చూడండి: సీఏఏను రద్దు చేయాలని మంత్రివర్గ తీర్మానం