కోస్తాంధ్ర ప్రాంతంపై 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. మరోవైపు బంగాళాఖాతంలో 4.5 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో ఈ నెల 6 నుంచి 12లోగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. దీని ప్రభావంతో నేడు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీగా, రేపు పలుచోట్ల భారీగా, అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి.
అత్యధికంగా కొత్తగూడెంలో 13, నల్గొండ జిల్లా చందూరు 11, పుల్లెంల(నల్గొండ)లో 10.2, గౌరారం(సిద్దిపేట జిల్లా)లో 11.1, మేడ్చల్ పారిశ్రామిక ప్రాంతంలో 10.6, తాడ్వాయి(ములుగు)లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శుక్రవారం మధ్యాహ్నం అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడ్డాయి.
ఇదీ చూడండి: Hyderabad Rains: లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఇంకెన్నాళ్లీ హైదరా'బాధలు'!!