రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,23,166 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 645 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,42,436కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. మరో 1,505 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో మరో నలుగురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,791కి చేరింది.
తాజాగా 729 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 6,29,408కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,237 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కరోనా మరణాల రేటు 0.59 శాతం ఉండగా.. అదే సమయంలో కోలుకుంటున్నవారి శాతం 97.97 శాతంగా ఉందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.3 శాతం ఉండగా.. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య 97.36 శాతంగా నమోదైంది.
జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు
ఇవాళ నమోదైన కేసులను జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా జీహెచ్ఎంసీ, ఖమ్మంలో 72 కేసుల చొప్పున నమోదయ్యాయి. తర్వాత రెండో స్థానంలో అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 58 కేసులు వెలుగుచూశాయి. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 24, జీహెచ్ఎంసీ 72, జగిత్యాల 32, జనగామ 5, జయశంకర్ భూపాలపల్లి 6, జోగులాంబ గద్వాల 2, కామారెడ్డి 3, కరీంనగర్ 58, ఖమ్మం 72, కుమురం భీం ఆసిఫాబాద్ 3, మహబూబ్నగర్ 7, మహబూబాబాద్ 15, మంచిర్యాల 20, మెదక్ 1, మేడ్చల్ మల్కాజి గిరి 31, ములుగు 4, నాగర్ కర్నూల్ 5, నల్గొండ 42, నారాయణ్ పేట 0, నిర్మల్ 3, నిజామాబాద్ 7, పెద్దపల్లి 47, రాజన్న సిరిసిల్ల 23, రంగారెడ్డి 27, సంగారెడ్డి 5, సిద్దిపేట 17, సూర్యాపేట 27, వికారాబాద్ 1, వనపర్తి 2, వరంగల్ రూరల్ 14, వరంగల్ అర్బన్ 52, యాదాద్రి భువనగిరి 16 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. నారాయణ్ పేట్ జిల్లాలో ఇవాళ ఒక్క కేసు కూడా నమోదు కాాకపోగా.. మెదక్ జిల్లాలో కేవలం ఒకరు మాత్రమే వైరస్ బారిన పడ్డారు.
ఇదీ చూడండి: