గడచిన 24 గంటల్లో 51,521 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 247 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,64,411కు చేరింది. ఈమేరకు వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
ఇవాళ కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,909కి చేరింది. తాజాగా కరోనాబారి నుంచి 315 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,877 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదీ చూడండి: కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం- సుప్రీంకోర్టు ప్రశంసలు