'కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకోవాలి' - tngos
రాష్ట్రాలు ఆర్థికంగా చేతులు ఎత్తేశాయని... కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకోవాలని అఖిల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్జీఈఎఫ్) తీర్మానం చేసింది. అఖిల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ కార్యవర్గ సమావేశం మీట్ యాప్ ద్వారా నిర్వహించారు. ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు రాజేందర్ తెలిపారు.
ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా... దేశవ్యాప్త ప్రదర్శన నిర్వహించనున్నట్లు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్ తెలిపారు. అఖిల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ కార్యవర్గ సమావేశం మీట్ యాప్ ద్వారా నిర్వహించారు. జాతీయ అధ్యక్షుడు సుభాష్ లంబా, ప్రధాన కార్యదర్శి శ్రీకుమార్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల నుంచి ఉద్యోగసంఘాల ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్రం నుంచి టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, టీఎన్జీవో నేతలు కారం రవీందర్ రెడ్డి, బండారు రేచల్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించారు. కరోనా వల్ల ఉద్యోగులకు జరిగిన నష్టాలను ప్రభుత్వాలు బాధ్యతతో తీర్చాలని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. కరోనా వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారిందని... తద్వారా ఉద్యోగులకు, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారికి వేతనాలు సరిగా అందట్లేదన్నారు.
రాష్ట్రాలు ఆర్థికంగా చేతులు ఎత్తేశాయని... కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకోవాలని అఖిల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్జీఈఎఫ్) తీర్మానం చేసింది. కేంద్రప్రభుత్వం అన్ని అధికారాలను, ఆదాయ వనరులను గుప్పెట్లో పెట్టుకొని గుత్తాధిపత్యంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ సర్వీసులను ప్రైవేటీకరణ చేస్తూ... ప్రజా సేవలను అమ్మకానికి పెడుతోందన్నారు. వివిధ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయట్లేదని... ఉన్న ఉద్యోగులపై పనిభారం పడుతోందని పేర్కొన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వ్యవస్థను రద్దుచేసి... అందులో పనిచేస్తున్న ఉద్యోగుల క్రమబద్దీకరణ డిమాండ్‌ను పెడచెవిన పెడుతున్నారని తెలిపారు. ఉద్యోగులకు కాలానుగుణంగా ఇచ్చే కరవుభత్యాన్ని విడుదల చేయడం లేదని... వేతన సవరణలు క్రమం ప్రకారం అమలు చేయడం లేదన్నారు. వీటన్నింటినీ సక్రమంగా అమలు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ... ఈనెల 29న భోజన విరామసమయంలో దేశవ్యాప్త నిరసనలను నిర్వహించాలని ఏఐఎస్ఈజీఎఫ్ పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కరోనా విధులు నిర్వహిస్తూ చనిపోయిన ఉద్యోగులకు భీమా సౌకర్యంతో పాటు... తెలంగాణ ప్రభుత్వం అదనంగా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు మంజూరు చేయడం పట్ల ఏఐఎస్జీఈఎఫ్ హర్షం వ్యక్తం చేసింది.