ETV Bharat / state

22 అంశాల తీర్మానంతో ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీవో మద్దతు - టీఎన్జీవో అధ్యక్షుడు కారెం రవీందర్​ రెడ్డి

ఆర్టీసీ సంఘాల సమ్మెకు టీఎన్జీవో పూర్తి మద్దతు తెలిపింది. సుమారు 22 అంశాలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ టీఎన్జీవో తీర్మానించింది. నేడు ఆర్టీసీ, ప్రభుత్వం ఉద్యోగ సమస్యలపై సీఎస్​ను కలిసి విన్నవిస్తామని టీఎన్జీవో అధ్యక్షుడు కారెం రవీందర్​ రెడ్డి తెలిపారు.

22 అంశాల తీర్మానంతో ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీవో మద్దతు
author img

By

Published : Oct 16, 2019, 5:57 AM IST

22 అంశాల తీర్మానంతో ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీవో మద్దతు
ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన సమ్మెకు టీఎన్జీవో సంపూర్ణ మద్దతు తెలిపింది. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు చాలా బాధించాయని టీఎన్జీవో అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి తాము సీఎస్‌ జోషిని నేడు కలిసి వివరిస్తామని ఆయన తెలిపారు. మంగళవారం నాడు నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో సంఘ ప్రతినిధులతో ఆర్టీసీ జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. తాము చేస్తున్న సమ్మెకు మద్దతు ఇవ్వాలని అర్టీసీ జేఏసీ నాయకులు కోరారు. కిందిస్థాయి నాయకులు అందరితో కలిసి చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని రవీందర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ తీర్మానాలను ఆయన విడుదల చేశారు.

22 అంశాలతో తీర్మానం:

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల స్థానంలో విధులు నిర్వర్తించటానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని టీఎన్జీవోస్​ కోరారు. పీఆర్సీ మంజూరు, సీపీఎస్​ రద్దు, రిటైర్మెంట్ వయోపరిమితి పెంపు, ఆంధ్రాలో పనిచేస్తోన్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పించటం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, జిల్లాల క్యాడర్​ స్ట్రెంగ్త్​, పెన్షనర్లకు 15 శాతం అదనపు పింఛను మంజూరు తదితర 15 సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ టీఎన్జీవో తీర్మానించింది.

ఇదీ చదవండిః కలెక్టర్లతో కేటీఆర్ దృశ్యమాధ్యమ సమీక్ష

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.