ఆకలితో అలమట్టిస్తున్న నిరుపేదలకు.. తెలంగాణ ఎన్జీవో సంఘం నిత్యం పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహాయం చేస్తున్నారు. లాక్డౌన్లో ప్రతిరోజు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు, రోగుల సహాయకులకు తెలంగాణ టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు, భోజనం అందజేస్తున్నారు.
కింగ్‌కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది రోగి సహాయకులకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. కరోనా మొదటి దశలోనూ.. టీఎన్జీవో ఆధ్వర్యంలో 56రోజల పాటు నిత్యావసర సరుకులను, ఆహార ప్యాకెట్లను, మెడికల్ కిట్లను అందజేశామన్నారు.
ఇవీ చూడండి: పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కొత్త పోర్టల్