శేరిలింగంపల్లి జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. శేరిలింగంపల్లి మున్సిపల్ సర్కిల్ పరిధిలో ఉన్న గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చి వేస్తున్నారు.
ఇప్పటి వరకు టీఎన్జీవో కాలనీలో పదిహేను అక్రమ నిర్మాణాలను గుర్తించామని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మూడు టీమ్లతో నిర్మాణాలను తొలగిస్తున్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి : పిల్లల అమ్మకాలకు ఏజెంట్ వ్యవస్థ.. 'సృష్టి'oచిన ఆసుపత్రి