ETV Bharat / state

'ఆర్టీసీకి వెంటనే పూర్తి స్థాయి ఎండీని నియమించండి' - టీఎంయూ అశ్వత్థామ రెడ్డి

ఆర్టీసీ యాజమాన్యం గైడ్ లైన్స్​ను కార్మికుల అభిప్రాయాలకు అనుగుణంగా ఇవ్వాలని టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి కోరారు. ఆర్టీసీకి వెంటనే పూర్తి స్థాయి ఎండీని నియమించాలని ఆయన డిమాండ్​ చేశారు.

tmu general secretary ashwatthama demanded that the rtc immediately appoint a full-fledged md
'ఆర్టీసీకి వెంటనే పూర్తి స్థాయి ఎండీని నియమించండి'
author img

By

Published : Mar 4, 2021, 6:07 PM IST

ఆర్టీసీలో సంక్షేమ మండళ్లు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కారిస్తామన్న సీఎం హామీలను.. ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి మండిపడ్డారు.హైదరాబాద్​లోని తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఆర్టీసీకి వెంటనే పూర్తి స్థాయి ఎండీని నియమించాలని డిమాండ్​ చేశారు.

యాజమాన్యం.. గైడ్ లైన్స్​ను కార్మికుల అభిప్రాయాలకు అనుగుణంగా ఇవ్వాలని అశ్వత్థామ రెడ్డి కోరారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆర్టీసీ ఉద్యోగులు.. రాష్ట్రం ఏర్పడిన అనంతరం, హక్కులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారంటూ.. పోరాటాలతోనే హక్కులు సాధించుకుంటామని వివరించారు.

ఆర్టీసీ కార్మికులు.. కనీసం పిల్లలకు ఫీజులు కూడా చెల్లించలేక పోతున్నారని అశ్వత్థామ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్లను భాగస్వామ్యం చేస్తే మూడేళ్లలో లాభాల బాట పట్టిస్తామన్నారు. స్వతంత్ర కమిటీలు ఏర్పాటు చేసి సంస్థలో ఏం జరుగుతుందో తెలపాలని కోరారు. ఎన్నికల తరువాత కార్మికులను సమాయత్తం చేసి.. సంఘాలు ఉండాలా వద్దా రెఫరెండం పెడతామని వివరించారు.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.