ETV Bharat / state

'సంక్షోభంలో వ్యవసాయం.. కేసీఆర్ ప్రజలకు చేసింది శూన్యం' - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలోని ప్రజా సమస్యలు పరిష్కరించే వరకు తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. హైదరాబాద్​ నాంపల్లి పార్టీ కార్యాలయంలో 'బతుకుదెరువు నిలబెట్టాలి- తెలంగాణను కాపాడాలి' నినాదంతో 48 గంటల దీక్ష చేపట్టారు.

TJS president Kodandaram is undergoing a 48-hour initiation
ప్రజా సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తాం: కోదండరాం
author img

By

Published : Jan 3, 2021, 8:17 PM IST

నిరుద్యోగులు, రైతులు, ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకుగాను చేపట్టిన నిరాహారదీక్షకు పోలీసులు అనుమతివ్వకపోవడం శోచనీయమని తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. నిరుద్యోగ యువత, వ్యవసాయ సంక్షోభంతో దిగాలుపడ్డ రైతులు, దైన్యంలో ఉన్న ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోదండరాం 48 గంటల దీక్షకు దిగారు. మొదటగా ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద దీక్షను నిర్వహించాలని నిర్ణయించగా.. పోలీసులు అనుమతించలేదు. దీంతో పార్టీ కార్యాలయంలోనే ఆయన దీక్షకు కూర్చున్నారు. కోదండరాం దీక్షకు సీపీఐ, సీపీఎం, తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ, ప్రముఖ విద్యవేత్త చుక్కా రామయ్య సంఘీభావం తెలిపారు.

ఆరేళ్లయినా

ప్రభుత్వం ఏర్పడి ఆరేళ్లయినా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం దారుణమని.. దీంతో అనేక మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలు పరిష్కరించే వరకు తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయం కూడా సంక్షోభంలో కూరుకుపోయిందని.. అన్నదాతలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోరాటం ఆపేదిలేదని స్పష్టం చేశారు.

ఎక్కడికక్కడే దీక్షకు కూర్చోవాలి

అనుకున్న విధంగా 48 గంటల పాటు దీక్షను యథాతథంగా కొనసాగించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు హైదరాబాద్‌ చేరుకోవాలని పిలుపునిచ్చారు. పోలీసులు ముందస్తు అరెస్టులు చేపడితే పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడే దీక్షకు కూర్చోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎల్‌. రమణ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. సాధారణ ప్రజల జీవన ప్రమాణాల్లో ఈ ప్రభుత్వం ఎలాంటి మార్పు తీసుకురాలేకపోయిందని విమర్శించారు.

ప్రముఖుల సంఘీభావం

స్వార్థం కోసం లేదని.. తెలంగాణ యువకుల బంగారు భవిష్యత్తు కోసం కోదండరాం పోరాటం చేస్తున్నారని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. నాంపల్లి తెజస కార్యాలయంలో కోదండరాం చేపట్టిన దీక్షకు చుక్కా రామయ్య హాజరై సంఘీభావం తెలిపారు. నిరుద్యోగంతో రాష్ట్రంలోని యువకులంతా నీరుగారిపోయారని.. ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఇవ్వబోతున్నారని అన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల వాణిని వినిపించే వ్యక్తిగా కోదండరాంని చుక్కా రామయ్య కొనియాడారు.

ఇదీ చదవండి: కొవాగ్జిన్ టీకాను అన్నిదేశాలకు అందిస్తాం: భారత్‌ బయోటెక్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.