ఫిబ్రవరి మూడో వారంలో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. అన్ని వర్గాలు అందుకు సహకరించి మద్దతు ఇవ్వాలని కోరారు. దిల్లీలో చలిలో ఆందోళన చేస్తున్న రైతుల స్ఫూర్తితో ఉద్యమం చేస్తామన్నారు.
నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో 'బతుకుదెరువు నిలబెట్టాలి- తెలంగాణను కాపాడాలి' నినాదంతో చేపట్టిన 48 గంటల దీక్షను కోదండరాం విరమించారు. నిరుద్యోగులు, రైతులు, ప్రైవేటు ఉపాధ్యాయుల బతుకుదెరువు నిలబెట్టాలి డిమాండ్ల చేశారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు.
ఈ నెల 20వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. చివరగా ఛలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. వ్యవసాయ సంక్షోభంతో రైతు దిగాలు పడ్డారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి మూకుమ్మడిగా నడుం బిగిద్దామన్నారు.
ఇవీచూడండి: భాజపా శ్రేణులు రోడ్డెక్కితే.. జగన్ మూటాముల్లె సర్దుకోవాలె: సంజయ్