తెలంగాణ రాష్ట్ర పాలనా రంగంలో సంక్షోభం నెలకొందని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా కుంగిపోయిందని తెలిపారు.
దాదాపు ప్రభుత్వం రూ.2.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చిందని కోదండరాం అన్నారు. ఆ అప్పులకు వడ్డీలే ప్రతి ఏడాది రూ.20 వేల కోట్లు కట్టాల్సి వస్తోందని తెలిపారు. ఇక... రాష్ట్ర అభివృద్ధి సాధ్యమే కాకపోవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి : అరకొర నైపుణ్యమే!