రాష్ట్ర ప్రభుత్వం ఏడేళ్లుగా రాజకీయ పార్టీల ఉద్యమాలను అణచివేసేందుకు సెక్షన్ 151ను విచ్చలవిడిగా వినియోగిస్తోందని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగితే అరెస్ట్ చేయడం కోసమే 151 తీసుకొచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆసరాగా తీసుకుని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యమాన్ని నియంత్రించే అధికారం మాత్రమే ఉంది కానీ.. నిలువరించే అధికారం లేదన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం అక్టోబర్ 5న మేం పెద్దఎత్తున రాస్తారోకో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చట్టబద్ధంగా మేం ముందుకెళ్తున్నట్లు వివరించారు. అఖిలపక్ష నేతలందరూ శాంతియుతంగా రాస్తారోకోలు నిర్వహిస్తామని కోదండరాం స్పష్టం చేశారు.
భారత్ బంద్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమాలను అణచి వేయాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం బంద్కు సహకరించకపోగా అన్యాయంగా అరెస్టులు చేశారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. దీనిపై డీజీపీకి జరిగిన పరిణామాలను వివరిస్తే సానుకూలంగా స్పందించారన్నారు.
శాంతి భద్రతలకు భంగం కలిగితే అరెస్ట్ చేస్తే 151 సెక్షన్ అవసరం. రాష్ట్ర ప్రభుత్వం ఏడేళ్లుగా రాజకీయ పార్టీల ఉద్యమాలను అణిచివేసేందుకు ఉపయోగిస్తోంది. 151 సెక్షన్ దుర్వినియోగం జరుగుతోంది. ఉద్యమాలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉంది. అంతేకానీ నిలువరించే అధికారం లేదు. మీరు ఏమైనా సూచనలు ఉంటే ఇవ్వండి. పోడు సమస్యల పరిష్కారానికి అక్టోబర్ 5న రాస్తోరోకో నిర్వహిస్తాం. ఈ రాస్తారోకో శాంతియుతంగా నిర్వహించే బాధ్యత మాది. చట్టబద్ధంగా అరెస్టులు ఉండాలి. మేము కూడా శాంతియుతంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. -కోదండరాం, తెజస అధ్యక్షుడు
భారత్ బంద్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేశాం. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆందోళన చేస్తే ఉక్కుపాదంతో అణిచివేయాలని చూస్తున్నారు. మహిళలని చూడకుండా పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. డీజీపీ పోలీసులపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. -చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
తెలంగాణలో ప్రభుత్వం బంద్కు సహకరించకపోగా కారులో ఉన్న కోదండరాంను అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారు. డీజీపీకి జరిగిన పరిణామాలను వివరిస్తే సానుకూలంగా స్పందించారు. 151 సెక్షన్ను రాజకీయ నాయకులు మీద పెట్టడం మంచిది కాదని చెప్పాం. సహకరించాలని డీజీపీని కోరాం. - మల్లు రవి,టీపీసీసీ ఉపాధ్యక్షుడు
ఇదీ చూడండి: kodandaram on mahadharna: ఇందిరాపార్క్ మహాధర్నాను విజయవంతం చేయండి: కోదండరాం