ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేశారని.. పోలీసుల సమక్షంలోనూ అక్రమాలు జరిగాయన్నారు.
పోస్టల్ బ్యాలెట్ విషయంలో నిబంధనలు పాటించలేదని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. పోలింగ్ డబ్బాల భద్రతపై ఈసీ దృష్టి పెట్టి ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటివరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో అనుమానాలున్నాయని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో సీఈఓను కలిసి మరోసారి ఫిర్యాదు చేయబోతున్నట్లు వివరించారు. సరిగ్గా పోలింగ్ రోజు తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం వెనుక.. తెరాస హస్తం ఉందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ స్థానం నుంచి విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: సంక్షోభంలోనూ సడలని ధైర్యం.. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేద్దాం