పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని తెజస పార్టీ అధ్యక్షుడు కోదండరాం తమను కోరారని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. హైదరాబాద్ ఆదర్శనగర్‌లోని ఇంటి పార్టీ కార్యాలయంలో కోదండరాం, చెరకు సుధాకర్ భేటీ అయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించారు.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోదండరాం కోరగా... తాను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని తెజసకు సూచించినట్లు పేర్కొన్నారు. కోదండరాం ఏ నిర్ణయం తీసుకున్నా.. తాను మాత్రం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉంటానని చెరుకు సుధాకర్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'దుబ్బాకను సస్యశ్యామలం చేయడమే లక్ష్యం'