ETV Bharat / state

'తెలంగాణ ఉద్యమంలో మిలియన్​ మార్చ్​ ఎంతో కీలకం' - హైదరాబాద్ తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మిలియన్ మార్చ్​ వీరోచిత పోరాటమని... తెజస హైదరాబాద్​ జిల్లా అధ్యక్షుడు నర్సయ్య తెలిపారు. మిలియన్ మార్చ్ 2021 మార్చి 10వ తేదీతో పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా... పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ గన్​పార్క్​లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.

Tjs leaders pay homage to martyrs' monument in Hyderabad Gun Park
'తెలంగాణ ఉద్యమంలో మిలియన్​ మార్చ్​ విరోచిత పోరాటం'
author img

By

Published : Mar 10, 2021, 4:30 PM IST

మిలియన్​ మార్చ్​ వీరోచిత పోరాటాన్ని తెలంగాణ సమాజం, ఉద్యమకారులు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని... తెజస హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నర్సయ్య అన్నారు. పాలకులు అధికారికంగా చేయాల్సిన మిలియన్ మార్చ్​ను... కనుమరుగు చేయాలనే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. దశాబ్ద కాలపు ఉద్యమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరునా వందనాలు తెలిపారు.

మిలియన్ మార్చ్ 2021 మార్చి 10వ తేదీతో పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా... పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ గన్​పార్క్​లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఆ సమయంలో 50వేల మందిని ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేశారన్నారు. వారి నిర్బంధాన్ని ఛేదించుకుని ట్యాంక్ బండ్​ వద్దకు లక్షలాది మంది చేరుకుని మిలియన్​ మార్చ్​ను విజయవంతం చేశారని ఆయన గుర్తు చేశారు.

ఇదీ చదవండి: విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు: కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.