ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి శశాంక్ గోయల్‌కు తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం ఫిర్యాదు చేసింది. బుద్ధభవన్‌లోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు ఉన్నా.. తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ.... తెరాస ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సమావేశంలో పాల్గొనడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు. మరోమారు తన పదవీ కాలాన్ని పొడిగించుకోవడం కోసం తెరాస అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాపిరెడ్డిపై చర్యలు తీసుకొని వెంటనే పదవి నుంచి తప్పించాలన్నారు.తమ ఫిర్యాదును పరిశీలించి పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి హామీ ఇచ్చినట్లు వినోద్‌కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం దారుణం: నారాయణ