ETV Bharat / state

Kodandaram Mahapada Yatra : "హార్డ్​వేర్ పార్క్ హఠావో - తెలంగాణ బచావో" మహా పాదయాత్రకు కోదండరామ్ పిలుపు - హైదరాబాద్ తాజా వార్తలు

TJS Kodanadaram :హార్డ్​వేర్ పార్క్ హఠావో - తెలంగాణ బచావో పేరుతో మహా పాదయాత్ర చేపట్టనున్నట్లు.. తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ వె‌ల్లడించారు. అక్రమ ఎక్స్​టెన్షన్ హార్డ్​వేర్ పార్క్​ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఏపీ లో జారీచేసిన భూ సేకరణ నోటిఫికేషన్ వల్ల గత రెండు దశాబ్దాలుగా ప్రజలు భూ దోపిడీకి గురయ్యారని పేర్కొన్నారు. బాధితుల తరపున నిరసన గళమెత్తుతూ మహాపాదయాత్రకు పూనుకున్నారు. భారాస ప్రభుత్వ వైఫల్యాలపై మండిపడిన ప్రొ.కోదండరామ్ మరికొన్ని డిమాండ్లు చేశారు.

"హార్డ్​వేర్ పార్క్ హటావో - తెలంగాణ బచావో" మహా పాదయాత్రకు పిలుపు : ప్రొ. కోదండరామ్

author img

By

Published : Aug 1, 2023, 8:24 PM IST

Kodandaram's Call For The Great Footmarch : 'హార్డ్​వేర్ పార్క్ హఠావో - తెలంగాణ బచావో' పేరుతో మహా పాదయాత్ర చేపట్టనున్నట్లు.. తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ వె‌ల్లడించారు. పాదయాత్రకు సంబంధించిన పోస్టర్​ను ఆయన, పార్టీ నాయకులతో కలసి హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆగస్టు 7న ఉదయం 9 గంటలకు నాదర్​గుల్ సెంటర్​లో ప్రారంభమై.. ఆదిభట్ల మీదుగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వరకు మహా పాదయాత్ర కొనసాగుతుందన్నారు.

Hardware Park Hathao - Telangana Bachao : ఈ మహా పాదయాత్రలో బాధిత రైతులు, నివాస స్థలాల యజమానులు, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. బాధిత రైతులు ఎన్నిసార్లు మొర పెట్టుకున్న ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవట్లేదని తెలిపారు. అవసరానికి మించి 1000 ఎకరాలు వ్యవసాయ భూమిని భూసేకరణ చేపట్టారని తెలిపారు. ఉమ్మడి ఏపీలో జారీచేసిన భూ సేకరణ నోటిఫికేషన్ వల్ల గత 24 ఏళ్లుగా నాదర్​గుల్, ఆదిభట్ల, ఎం.ఎం.కుంట గ్రామాల ప్రజలు భూ దోపిడికి గురయ్యారని పేర్కొన్నారు.

అప్పటి ప్రభుత్వం అవసరమున్న భూమిని సేకరించిందని.. కానీ అవసరం లేని భూమిని కూడా అన్యాయంగా ఇప్పుడు ప్రభుత్వ ఖాతాలో చేర్చుకున్నారని తెలిపారు. ఆ భూమిలో దాదాపు 20 వేల ప్లాట్లు ఉన్నాయని.. AP/TSIIC వారు నష్టపరిహారం కూడా ఇవ్వలేదన్నారు. అక్రమ ఎక్స్​టెన్షన్ హార్డ్​వేర్ పార్క్​ని తొలగించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు బాధితులకు అండగా ఉంటామని ప్రొ. కోదండరామ్ స్పష్టం చేశారు.

Pro. Kodandaram Demands To BRS Party : ప్రకృతి వైపరీత్యాల నివారణ కోసం 2005లో తెచ్చిన చట్టాన్ని.. శాశ్వత ప్రాతిపదికన ప్రణాళిక బద్ధంగా అమలు చేయలేదన్నారు. పునరావాసం ప్రయత్నం చేయక పోవడం వల్లే ఇప్పుడు వరదలు తలెత్తాయని, వాటి ధాటికి చాలా గ్రామాలు, పట్టణాలు నీట మునిగాయన్నారు. చట్ట ప్రకారం బాధ్యత పాటిస్తే ఈ పరిణామాలు జరిగేవి కాదన్నారు. ఆలస్యంగా తెలంగాణా రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వ సంస్థగా మారుస్తున్నారన్నారు. ఆర్టీసీలో 56 మంది కార్మికులు చనిపోయిన తర్వాత.. అన్ని పార్టీలు కలిసి ఒక సంఘీభావ ఉద్యమం చేసినప్పుడైనా స్పందించి ఉంటే బాగుండేదన్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేసే విధంలో రద్దు చేసిన కార్మిక సంఘాలను పునరుద్ధరించి.. వారికి భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం రూ.16 వేలు చెల్లించాలని కోరారు. గురుకుల పరీక్ష విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలు చేస్తూ.. తుగ్లక్ పాలనను అమలు చేస్తోందని మండిపడ్డారు. పరీక్షలను వాయిదా వేయాలని.. లేని పక్షంలో ప్రతి అభ్యర్థి ఒకే చోట పరీక్ష రాసే విధంగా ఏర్పాటు చేయాలని కోదండరామ్ కోరారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.