ETV Bharat / state

మార్చి 22 నుంచి కృత్రిమ మేథపై మరింత శిక్షణ: టీటా డిజిథాన్​ - more training on ai from march 22nd

కృత్రిమ మేథపై ఇంటర్న్​షిప్​ సహిత శిక్షణనిచ్చిన టీటా డిజిథాన్​.. దానికి కొనసాగింపుగా ఏఐ- 2021 శిక్షణనివ్వనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ నెల 22నుంచి ఈ శిక్షణ ప్రారంభం కానున్నట్లు తెలిపింది. నామమాత్రపు ఫీజుతోనే కోర్సు అందిస్తామని వెల్లడించింది.

tita digithon, ai
మార్చి 22 నుంచి ఏఐ శిక్షణ
author img

By

Published : Mar 15, 2021, 5:25 PM IST

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ, ఈ రంగంలో పెరుగుతున్న ఉద్యోగావకాశాలను దృష్టిలో పెట్టుకొని.. ఏఐ విభాగంలో మరింత శిక్షణనివ్వనున్నట్లు టీటా డిజిథాన్ ప్రకటించింది. గతంలో ఏఐపై ఇంటర్న్​షిప్ సహిత శిక్షణనిచ్చిన టీటా.. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఏఐ - 2021 శిక్షణనివ్వనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 22 నుంచి శిక్షణ ప్రారంభం కానుందని.. కోర్సులో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్, చాట్​బాట్, మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వంటి అంశాలపై కోచింగ్​ ఇస్తామని పేర్కొంది.

రెండు నెలల కోర్సులో ఉత్తీర్ణత పొందిన వారికి అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డెల్లాస్ ద్వారా శిక్షణాపత్రం ఇవ్వనున్నారు. బయట రూ. లక్షల్లో ఖర్చయ్యే ఈ కోర్సును నామమాత్రపు ఫీజుతోనే అందిస్తామని స్పష్టం చేసింది. వివరాలకు bit.ly/digithon_academy సైట్​ను సందర్శించాలని టీటా సూచించింది.

ఇదీ చదవండి: ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ: కోదండరాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.