ETV Bharat / state

ఆన్​లైన్​లో శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు - ఫిబ్రవరి నెల తిరుమల ప్రత్యేక దర్శన టిక్కెట్లు

ఫిబ్రవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లను తితిదే విడుదల చేసింది. ఆన్​లైన్​లో టిక్కెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది. శ్రీవారి దర్శన టిక్కెట్లతో పాటు.. గదులను పొందే అవకాశాన్ని తితిదే కల్పిస్తోంది.

tirumala-special-entry-tickets-available-in-online
ఆన్​లైన్​లో శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు
author img

By

Published : Jan 20, 2021, 12:52 PM IST

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను తితిదే విడుదల చేసింది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన కోటాను ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచారు. రోజుకు 20 వేల టిక్కెట్ల చొప్పున.. ఒక్కరోజుకి 17 స్లాట్​లలో మూడు వందల రూపాయల టిక్కెట్లను విడుదల చేశారు. ఒక యూజర్ ఐడీ నుంచి ఆరు టిక్కెట్ల వరకు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు.

కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పిస్తున్న తితిదే.. నెలకోసారి టిక్కెట్లను ఆన్​లైన్ ద్వారా విడుదల చేస్తోంది. ముందస్తుగా టిక్కెట్లు పొందిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు. నేటి సాయంత్రం మూడు గంటల నుంచి, ఫిబ్రవరికి సంబంధించిన తిరుమల, తిరుపతిలో ఉన్న తితిదే అద్దె గదులను అందుబాటులో ఉంచనున్నారు. శ్రీవారి దర్శన టిక్కెట్లతో పాటు.. గదులను పొందే అవకాశాన్ని తితిదే కల్పిస్తోంది.

ఇదీ చదవండి: యాదాద్రికి చేరిన సాలహారాల విగ్రహాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.