తిరుమల శ్రీవారి గాలిగోపురానికి ఉండే తిరునామాలు దాదాపు గంటపాటు సగమే వెలగటం శ్రీవారి భక్తులను కలవరపెట్టింది. శ్రీవారి దర్శనం కోసం కాలినడకన వెళ్లాలన్నా, ఘాట్ రోడ్డుపై ప్రయాణించాలన్నా అలిపిరి గరుడ విగ్రహం వద్ద నుంచి కనిపించే గాలిగోపురం తిరునామం, శంఖుచక్రాలకు భక్తులు మొక్కుకుని వెళ్లటం సంప్రదాయంగా వస్తోంది. గాలిగోపురానికి ఉండే ఈ గోవింద నామాలు, శంఖుచక్రం మొత్తం తిరుపతి నగరమంతా వెలుగులీనుతూ దర్శనమిస్తాయి.
భక్తులే కాకుండా నగరవాసులంతా సంధ్యవేళలో గోవిందనామాలను దర్శించుకుంటారు. గోవిందనామాల కోసం ఏర్పాటు చేసిన లైట్లు గంట పాటు సగమే వెలుగుతున్నా తితిదే సిబ్బంది పట్టించుకోకపోవటం పలు విమర్శలకు దారితీసింది. సాయంకాలం నమస్కరించుకుందామని చూసిన భక్తులు...నామం సగమే కనిపిస్తుండటంతో తితిదే సిబ్బంది అజాగ్రత్తను తప్పుబట్టారు.
ఇదీ చదవండి: విద్యుత్ వాహనాలపై ఆసక్తి.. ఛార్జింగ్ కేంద్రాలకు గిరాకీ...