ETV Bharat / state

బరువు తగ్గడానికి ‘లాక్‌డౌన్‌ ఛాలెంజ్‌’ స్వీకరిస్తారా?

author img

By

Published : Apr 18, 2020, 1:49 PM IST

ఇప్పుడు ప్రపంచమంతా ట్రెండ్‌ అవుతోన్న పదాలు రెండే రెండు.. ఒకటి కరోనా, రెండోది లాక్‌డౌన్‌. కరోనా కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఉన్న విషయం తెలిసిందే. బిజీబిజీ జీవితాలు గడుపుతూ కనీసం మన కోసం కూడా టైం కేటాయించలేని పరిస్థితి నుంచి ఒక్కసారిగా మన కోసం కావాల్సినంత సమయాన్ని కేటాయించుకునే అవకాశం దొరికింది. ఈ సమయంలో బరువు తగ్గాలనుకునే వారికిది అద్భుతమైన అవకాశం అని చెప్పచ్చు.

Tips for losing weight
బరువు తగ్గడానికి ‘లాక్‌డౌన్‌ ఛాలెంజ్‌’ స్వీకరిస్తారా?

బిజీగా ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలనుకున్నా సమయం లేక అది కుదరకపోవచ్చు. కానీ ఈ స్వీయ నిర్బంధ సమయంలో ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. అందుకోసం కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలంటున్నారు.. అవేంటంటే..

మొదటి అడుగు ఆరోగ్యకరంగా..!

టీ, కాఫీలు లేకపోతే చాలామందికి రోజు ప్రారంభం కాదు. కానీ బరువు తగ్గాలనుకునే ఛాలెంజ్‌లో భాగంగా మనం వేసే మొదటి అడుగు ఆరోగ్యకరంగా ఉండాలి. అందుకోసం ముందుగా టీ, కాఫీ అలవాటు ఉన్నవారు వాటిని కాస్త పక్కన పెట్టి.. నిమ్మరసం-తేనె కలిపిన నీటిని తీసుకోవాలి. ఒకవేళ కచ్చితంగా టీ తాగాలనుకునే వారు గ్రీన్‌ టీ లేదా తులసి ఆకుల టీని తాగచ్చు. సాధ్యమైనంత మేర కాఫీని మానుకోవడమే మంచిది. ఎందుకంటే కాఫీ తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. కాబట్టి మరీ అంతగా కాఫీ మీదకు మనసు లాగుతుంటే ఉదయం లేదా సాయంత్రం అలా ఓ కప్పు.. అది కూడా కాఫీ పొడి తక్కువగా వేసుకొని తీసుకోవడం మంచిది. కాబట్టి మీ రోజును ఇలా ఆరోగ్యకరమైన అలవాటుతో మొదలుపెడితే ఆ రోజంతా ఉత్సాహంగా ఉండచ్చు.. ఇలా క్రమం తప్పకుండా చేస్తే త్వరలోనే మీ బరువులో మార్పును గమనించచ్చు.

ఆహారం ఇలా తీసుకోండి..!

మన బరువు అదుపులో ఉంచడంలో ఆహారం పాత్ర చాలా కీలకమైందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఉదయం తీసుకునే అల్పాహారం దగ్గర్నుంచి రాత్రి భోజనం వరకు ఆరోగ్యకరమైన డైట్‌ తీసుకునేలా ప్లాన్‌ చేసుకోండి. అలాగని ఇందుకోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే అటు హెల్దీగా.. ఇటు ఫిట్‌గా మారిపోవచ్చు. మీకు వీలైతే ఈ సీజన్‌లో దొరికే పండ్లు తీసుకోవచ్చు.. అలాగే ఇంట్లో దొరికే ఆకుకూరలు, కూరగాయలతో సలాడ్స్‌, సూప్స్‌ చేసుకొని తాగచ్చు. వీటితో పాటు కోడిగుడ్లు, నట్స్‌, పాలు.. వంటి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అరుగుదల నెమ్మదిగా ఉంటుంది.. తద్వారా కడుపునిండుగా ఉండి ఇతర అనారోగ్యకరమైన స్నాక్స్‌ మీదకు మన దృష్టి మళ్లదు. అంతేకాకుండా.. చక్కెరకు బదులుగా తేనె తీసుకోవడం, వంటల్లో ఉప్పు వాడకం తగ్గించడం, మంచి నీళ్లు ఎక్కువగా తాగడం కూడా ముఖ్యమే. ఇక మనం తీసుకునే ఆహారం వేళకు తినేలా ప్లాన్‌ చేసుకోవాలి. ఈ టిప్స్‌ అన్నీ పాటించడం రోజువారీ అలవాటుగా చేసుకుంటే బరువు తగ్గడం సులువవుతుంది.

ఇంటి పనులు మీరే స్వయంగా..!

ఆరోగ్య నియమాలకు వ్యాయామం తోడైనప్పుడే మంచి ఫలితాలు అందుతాయి. మొన్నటిదాకా బిజీగా ఉండే సమయాల్లో ఇంటి పనులు పనిమనుషులకు అప్పగించి ఓ అరగంట పాటు వ్యాయామం, యోగా, ధ్యానం.. వంటివి చేసేవాళ్లం.. కానీ ఇప్పుడు మన పనులన్నీ మనమే చేసుకోవాలి. పైగా అలాంటి పనులతో మన శరీరానికి చక్కటి వ్యాయామం అందుతుంది కూడా! ఈ క్రమంలో ఇంటిని శుభ్రం చేయడం, అల్మరాలు సర్దడం, వంట చేయడం.. వంటి పనులన్నీ మన శరీరానికి మంచి వ్యాయామాన్ని అందిస్తాయి. అలాగని రోజూ చేసే వ్యాయామం మానమని కాదు.. ఇలా ఇటు పనుల్ని, అటు వ్యాయామాన్ని కొనసాగించడం వల్ల శరీరం ఉత్సాహంగానూ మారుతుంది. అలాగే ఈ సమయంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, మానసిక ఆందోళనల్ని దూరం చేసుకోవడానికి రోజూ యోగా చేయడం తప్పనిసరి. ఇలా ఈ చిట్కాలు పాటిస్తే బరువు తగ్గడం సులువవుతుంది.. మానసిక ప్రశాంతతా లభిస్తుంది.

హాయిగా నిద్రపోండి..

ఆహారం.. వ్యాయామం.. తర్వాత బరువును తగ్గించడంలో తోడ్పడేది సరిపడా నిద్ర. ఖాళీగానే ఉంటున్నాం కదా.. ఎప్పుడైనా పడుకోవచ్చు.. ఎంతసేపైనా నిద్రపోవచ్చు.. ఎప్పుడైనా లేవచ్చు అనుకోవద్దు. సరైన సమయం నిద్రకు కేటాయించడం మంచిది. అలాగే ఇంటి నుంచి పనిచేసుకునే ఆప్షన్‌ ఉన్న వారు కూడా త్వరగా పని ముగించుకొని వేళకు నిద్ర పోవడం అవసరం. రోజూ 8 గంటలు సుఖంగా నిద్రపోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు పదే పదే చెబుతుంటారు. నిద్ర వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. ఇలా జీర్ణ సమస్యలు లేనప్పుడు అది క్రమంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాదు.. సరిపడా నిద్రపోవడం వల్ల ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి మానసిక సమస్యలు లేకపోతే.. శారీరకంగా కూడా మనం చేసే ప్రతి పనిలో చక్కటి అవుట్‌పుట్‌ కనిపిస్తుంది.

మానసిక ప్రశాంతత అవసరం..

బరువు తగ్గడానికి, మానసిక ప్రశాంతతకు చాలా దగ్గరి సంబంధం ఉంది. మనం మానసికంగా ప్రశాంతంగా లేకపోతే.. అది మన ఆహార, వ్యాయామ అలవాట్లపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తద్వారా బరువు తగ్గడం అటుంచి ఇంకా పెరిగే ప్రమాదమే ఎక్కువ. కాబట్టి మానసికంగా దృఢంగా ఉండడం ముఖ్యం. ఈ క్రమంలో కరోనా గురించి మరీ లోతుగా ఆలోచించి ఒత్తిడి పెంచుకోవడం, ఈ వైరస్‌ గురించి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టే ప్రతి వార్తనూ నిజమని నమ్మి భయాందోళనలకు గురవడం.. వంటివి అస్సలు వద్దు. ఈ క్రమంలో ఒత్తిడికి చెక్‌ పెట్టాలంటే ఇంటర్నెట్‌ను సాధ్యమైనంత తక్కువగా.. అవసరం ఉన్న పనులకే వాడుకోవాలి. అలాగే ఈ సమయంలో ధైర్యంగా ఉంటూ ప్రతి విషయంలో ఎవరిని వారు ప్రోత్సహించుకోవాలి. సులభంగా వేసే యోగాసనాలు ప్రాక్టీస్‌ చేయాలి. ఇంటి పనులు, ఆఫీస్‌ పనులు పూర్తయ్యాక ఖాళీ సమయం ఉంటే కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించాలి. అలాగే కాసేపు మీ భాగస్వామితో ఏకాంతంగా గడిపితే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. నచ్చిన సంగీతం వినడం, పుస్తకాలు చదవడం.. వంటివీ మానసిక ప్రశాంతతను అందిస్తాయి. కాబట్టి ఇలా మీ మనసుకు నచ్చిన పనులను చేస్తూ ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనలను అధిగమించాలి. తద్వారా మనసూ ప్రశాంతంగా ఉంటుంది.. బరువూ తగ్గుతాం.. అలాగే మీరు చేసే పనులపై పూర్తి దృష్టి నిలపచ్చు.. ఏమంటారు?

ఇవన్నీ మనం చాలా సార్లు విన్న చిట్కాలే అయి ఉండచ్చు.. కానీ వీటిని పాటించడంలో మనం ఎంత వరకు సఫలీకృతులం అవుతున్నామన్నదే ఇక్కడ ముఖ్యం. కాబట్టి ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని బందీఖానాగా భావించడం మాని.. బరువు తగ్గడంపై దృష్టి పెట్టండి.. అందుకు చక్కటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోండి.. ఇంట్లోనే ఉండండి.. ఆరోగ్యంగా, ఫిట్‌గా మారిపోండి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.