సికింద్రాబాద్‌కు చెందిన దగడ్ సాయి అనే వ్యక్తి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుటుంబ సభ్యులతో చేసిన టిక్‌టాక్ వీడియోను సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వైరల్ చేస్తున్నారంటూ వాపోయారు. తన పరువును భంగం కలిగించేలా కావాలని కొందరు వ్యక్తులు ప్రవర్తిస్తున్నారంటూ తెలిపారు.
టిక్‌టాక్‌లో వీడియోలను అసభ్యకరంగా వైరల్ చేయడం పట్ల ఎంతో మంది అమ్మాయిలు ఆవేదనకు గురవుతున్నారని ఆయన వాపోయారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సీసీఎస్‌ను కోరారు. ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: వెలవెలబోయిన తిరుమల క్షేత్రం.. శుభ్రపరుస్తున్న సిబ్బంది