యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజీపురం మహాలక్ష్మి కాటన్ జిన్నింగ్ మిల్లులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ప్రారంభించారు. దళారీ వ్యవస్థను రూపుమాపి రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో కేసీఆర్ సర్కార్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతిరైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో.. మార్కెట్ కమిటీ ఛైర్మన్ స్వాతి నరేశ్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి, జడ్పీటీసీ గొరుపల్లీ శారద సంతోశ్ రెడ్డి, సింగిల్ విండో ఛైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ కొండ సోంమల్లు, మండల పార్టీ అధ్యక్షుడు పొన్నెబోయిన రమేశ్ పాల్గొన్నారు.
- ఇదీ చూడండి: బాలుడి కిడ్నాప్ డ్రామా... విస్తుపోయిన పోలీసులు!