ప్రసుత్త రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఓ చోట కలుసుకోవాలంటేనే సాధ్యపడని కాలమిది. అలాంటిది ఏకంగా ఆరు తరాలకు చెందిన 300 మంది కుటుంబీకులు ఒకే చోట చేరటం ఆశ్చర్యమే. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో నాగుల్ లంక గ్రామం ఉంది. ఇక్కడ లక్కిం శెట్టి కుటుంబం కొన్ని తరాలుగా నివాసం ఉంటున్నారు. వీరంతా ఉద్యోగాల రీత్యా... వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. సంక్రాంతి పండుగ కోసం.. ఏకంగా 6 తరాలకు చెందిన మూడు వందల మంది కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. సంక్రాంతి సంబురాల్లో మునిగి తేలారు. ముగ్గులు, గొబ్బెమ్మలు, వంటలు, ఆటలు ఆనందంగా గడిపారు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే... అందరూ ఏకరూప దుస్తులు ధరించడం.
ఇందుకు కారణం... ఈనాడు సండే మ్యాగ్జైన్లో నీలం రంగు గురించి కథనం చదివి.. దాని స్ఫూర్తిగా... చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరు సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల పాటు ఒకే రంగు దుస్తులు ధరించారు. వారి అమ్మమ్మ ఇంట్లో... ఆటపాటలతో సందడి చేశారు.
ఇవీ చూడండి: అసద్దుదీన్పై ఎన్నికల సంఘానికి మర్రి ఫిర్యాదు