రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలలో 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది.
ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉందని పేర్కొంది. గురువారం ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.