రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల నుంచి సోమవారం నైరుతి రుతుపవనాలు ఉపసంహరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈనెల 28 నాటికి మిగిలిన ప్రాంతాల నుంచి మొత్తం భారతదేశం నుంచి నైరుతి రుతుపవనాలు ఉపసంహరించే అవకాశం ఉందని పేర్కొంది.
అదే సమయంలో తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఈశాన్య రుతుపవన వర్షాలు అక్టోబర్ 28న ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదీ చదవండి: నిరాధార ఆరోపణలతో జడ్జిలపై లేఖ రాశారు: అశ్వినీకుమార్