కరోనా విజృంభిస్తోన్న తరుణంలో విద్యార్థుల శ్రేయస్సు కోసం ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ దీక్ష చేపట్టారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీ భవన్లో దీక్ష చేస్తున్న ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థుల ఆరోగ్యం క్షిణించినట్లు వైద్యులు వెల్లడించారు. దీక్షాస్థలానికి చేరుకున్న ఉత్తమ్, సీనియర్ నేత వి.హనుమంతరావు... వైద్యుల సలహా మేరకు వెంకట్‌ను శ్రీనగర్ కాలనీలోని నిఖిల్ ఆసుపత్రికి తరలించారు.
రాష్ట్రంలో నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని వెంకట్‌తో సహా పలువురు విద్యార్థులు ఈనెల 27 నుంచి గాంధీభవన్‌లో ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు.
ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కమిటి తీర్మానం మేరకు... ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా రాజ్‌భవన్ ముట్టడికి విద్యార్థులు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇదీ చదవండి: మహిళల్లో కరోనా ప్రభావం తక్కువ.. కారణం అదే!