రాష్ట్రంలో ఎండల తీవ్రత, వడగాడ్పులు కొనసాగుతున్నాయి. వచ్చే మూడు రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 43 నుంచి 45 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
జర జాగ్రత్త
ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ పట్టణం, వరంగల్ గ్రామీణం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు.
ఇదీ చూడండి : మృతదేహాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి