ETV Bharat / state

సంక్రాంతికి ఊరికెళితే ముందే చెప్పండి: సీపీ

author img

By

Published : Jan 13, 2021, 3:34 PM IST

స్వగ్రామాలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ​పోలీస్​ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సీపీ పలు సూచనలు చేశారు.

స్వగ్రామాలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలి: సీపీ అంజనీకుమార్

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్వగ్రామాలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ​పోలీస్​ కమిషనర్‌ అంజనీకుమార్‌ సూచించారు. నగరంలో రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌, నిఘా అధికం చేసినట్టు సీపీ పేర్కొన్నారు. స్వగ్రామాలకు వెళ్లే వారు ఆ సమాచారాన్ని సామాజిక మాధ్యమాలు, వాట్సాప్‌లో ప్రచారం చేయవద్దని... వాటిని నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.

గ్రామాలకు వెళ్లాలనుకునే వారు ఆయా కాలనీల సంక్షేమ సంఘాలు, స్థానిక పోలీసుస్టేషన్‌లలో ముందస్తు సమాచారం ఇవ్వాలని అంజనీకుమార్‌ కోరారు.

ఇవీచూడండి: కొండెక్కిన సంక్రాంతి సరకులు.. 50%పైగా పెరిగిన ఖర్చు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.