ETV Bharat / state
మున్సి'పోల్స్': పురపాలక రిజర్వేషన్లు ఇవే...
పురపాలక ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసింది. వార్డులతో పాటు పదవుల వారీ రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లు, 123 మున్సిపాల్టీలకు చెందిన మేయర్, ఛైర్పర్సన్ పదవులకు రిజర్వేషన్లు ప్రకటించారు. ఎస్టీ, ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన 50 శాతానికి మించకుండా బీసీలకు సీట్లను రిజర్వ్ చేశారు. సగం పదవులను లాటరీ ద్వారా మహిళలకు కేటాయించారు. ఈ ఎన్నికలతో పాటు వచ్చే ఎన్నికలకు కూడా ఇవే రిజర్వేషన్లు వర్తించనున్నాయి.
మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు
By
Published : Jan 5, 2020, 5:20 PM IST
పురపాలక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తైంది. శనివారం ప్రకటించిన వార్డుల వారీ తుది ఓటర్ల జాబితా ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. కార్పొరేషన్ల మేయర్, మున్సిపల్ ఛైర్పర్సన్ల పదవులకు రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్నికలు జరగుతున్న వాటితో పాటు ఇప్పుడు ఎన్నికలు లేని వాటికి కూడా రిజర్వేషన్లు ప్రకటించారు.
జడ్చర్ల, నకిరేకల్ మున్సిపాల్టీలకు సంబంధించి విలీన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. వీటితో పాటు ఏజెన్సీ ప్రాంతంలోని పాల్వంచ, మణుగూరు, మందమర్రి మున్సిపాల్టీలను కూడా రిజర్వేషన్లలో పరిగణలోకి తీసుకోలేదు. జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం సహా 13 కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట సహా 123 మున్సిపాల్టీలకు రిజర్వేషన్లు ప్రకటించారు.
ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి...
రాష్ట్రంలోని 13 కార్పోరేషన్లు యూనిట్‌గా తీసుకుంటే ఎస్టీ జనాభా ఒక శాతం కూడా లేదు. కానీ చట్టం ప్రకారం కనీసం ఒక పదవినైనా ఎస్టీలకు రిజర్వ్ చేయాల్సి ఉంది. అందుకే ఒక మేయర్ పీఠం ఎస్టీలకు దక్కింది. ఎస్సీల జనాభా మూడు శాతం ఉన్నందున ఒక మేయర్ పీఠాన్ని ఎస్సీలకు కేటాయించారు. ఎస్టీ, ఎస్సీలకు చెరో ఎనిమిది శాతం రిజర్వేషన్లు మేయర్ పీఠాల్లో దక్కినట్లైంది. మిగిలిన రిజర్వేషన్లను బీసీలకు కేటాయించారు. ఆ ప్రకారం బీసీలకు నాలుగు మేయర్ పీఠాలు దక్కాయి. మిగిలిన ఏడు మేయర్ పదవులు జనరల్ కేటగిరీలో ఉన్నాయి.
బీసీలకు 40 మున్సిపల్ ఛైర్పర్సన్ పదవులు..
మొత్తం 123 మున్సిపాల్టీల్లో ఎస్సీ జనాభా 3.3శాతంగా తేలింది. మున్సిపల్ ఛైర్పర్సన్ల పదవుల్లో వారికి 3 శాతం రిజర్వేషన్లు దక్కాయి. ఆ ప్రకారం ఎస్టీలకు 4 ఛైర్పర్సన్ పదవులు రిజర్వ్ అయ్యాయి. ఎస్సీల జనాభా 13 శాతానికి పైగా ఉండడం వల్ల 14 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఎస్సీలకు 17 మున్సిపల్ ఛైర్పర్సన్ పదవులు కేటాయించారు. 50శాతంలో మిగిలిన రిజర్వేషన్ల శాతాన్ని బీసీలకు కేటాయించారు. 33శాతం రిజర్వేషన్ల ప్రాతిపదికన బీసీలకు 40 మున్సిపల్ ఛైర్పర్సన్ పదవులు రిజర్వ్ అయ్యాయి. మిగిలిన 62 మున్సిపాల్టీల ఛైర్మన్ల పదవులు జనరల్ కేటగిరీలో ఉన్నాయి.
మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్లు గ్రేటర్ హైదరాబాద్ పీఠం మహిళదే..
రెండు కార్పొరేషన్లలో జనాభా అవరోహణా క్రమం ప్రకారం మీర్‌పేట మేయర్ పీఠం ఎస్టీలకు వచ్చింది. అదే తరహాలో రామగుండం మేయర్ పీఠం ఎస్సీలకు దక్కింది. ఒక్కొక్క సీటు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇక్కడ మహిళలకు ప్రత్యేకంగా రిజర్వ్ చేయలేదు. బీసీలకు బండ్లగూడ జాగీర్, జవహర్‌నగర్, నిజామాబాద్, వరంగల్ మేయర్ పీఠాలు దక్కాయి. ఇందులో రెండింటిని మహిళలకు లాటరీ ద్వారా కేటాయించారు. జవహర్‌నగర్, నిజామాబాద్ మేయర్ పదవులు మహిళల కోటాకు వెళ్లాయి.
ఎస్టీ, ఎస్సీ కోటాలో మహిళకు రిజర్వ్ అవకాశం లేనందున జనరల్ కేటగిరీలోని 7 స్థానాల్లో 4 మహిళలకు కేటాయించారు. ఖమ్మం, నిజాంపేట్, బడంగ్పేట్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠాలు మహిళలకు వెళ్లాయి. కరీంనగర్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ మేయర్ పదవులు జనరల్‌లో ఉన్నాయి.
కార్పొరేషన్ మేయర్ల రిజర్వేషన్లు సగం మహిళలకే..
మూడు మున్సిపాల్టీల్లో 4 పదవులు ఎస్టీలకు రిజర్వ్ కాగా... అందులో 2 మహిళలకు దక్కాయి. ఎస్సీలకు రిజర్వ్ అయిన 17 స్థానాల్లో 8 మహిళలకు కేటాయించారు. బీసీలకు 40 మున్సిపల్ ఛైర్పర్సన్ పీఠాలు వెళ్లగా అందులో 20 మహిళలకు కేటాయించారు. బీసీ మహిళా పదవులకు 20 స్థానాల్లో రిజర్వేషన్లు కేటాయించారు. బీసీ జనరల్ పదవులకు 21 స్థానాల్లో రిజర్వేషన్లు కేటాయించారు. జనరల్ కోటాలో మొత్తం 62 మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవులు ఉండగా... అందులో సగం స్థానాలు 31 పదవులు మహిళలకు దక్కాయి.
వచ్చే ఎన్నికలకూ ఇవే రిజర్వేషన్లు..
రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసిన పురపాలకశాఖ అందుకు అనుగుణంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. అనంతరం రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. కొత్త పురపాలక చట్టం ప్రకారం రెండు దఫాలకు ఒకే రిజర్వేషన్ వర్తిస్తుంది. ఈ రిజర్వేషన్లే వచ్చే ఎన్నికలకు కూడా వర్తించనున్నాయి.
ఇవీ చూడండి: ఏఏ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎవరికి 'రిజర్వ్' చేశారంటే!

File : TG_Hyd_35_05_Reservations_Final_Pkg_3053262
From : Raghu Vardhan
Note : Feed from 3G kit
( ) పురపాలక ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసింది. వార్డులతో పాటు పదవుల వారీ రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. రాష్ట్రంలోని 13 కార్పోరేషన్లు, 123 మున్సిపాల్టీలకు చెందిన మేయర్, చైర్ పర్సన్ పదవులకు రిజర్వేషన్లు ప్రకటించారు. ఎస్టీ, ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన, 50శాతానికి మించకుండా బీసీలకు సీట్లను రిజర్వ్ చేశారు. సగం పదవులను లాటరీ ద్వారా మహిళలకు కేటాయించారు. ఈ ఎన్నికలతో పాటు వచ్చే ఎన్నికలకు కూడా ఇవే రిజర్వేషన్లు వర్తిస్తాయి..లుక్
వాయిస్ ఓవర్ -01 పురపాలక ఎన్నికలకు సంబంధించిన పదవుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తైంది. నిన్న ప్రకటించిన వార్డుల వారీ తుదిఓటర్ల జాబితా ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. కార్పోరేషన్ల మేయర్, మున్సిపల్ ఛైర్ పర్సన్ల పదవులకు రాష్ట్రం యూనిట్ గా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. దీంతో ప్రస్తుతం ఎన్నికలు జరగుతున్న వాటితో పాటు ఇపుడు ఎన్నికలు లేని వాటికి కూడా ఇపుడే రిజర్వేషన్లు ప్రకటించారు. జడ్చర్ల, నకిరేకల్ మున్సిపాల్టీలకు సంబంధించి విలీన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. వీటితో పాటు ఏజెన్సీ ప్రాంతంలోని ఇల్లందు, మణుగూరు, మందమర్రి మున్సిపాల్టీలను కూడా రిజర్వేషన్లలో పరిగణలోకి తీసుకోలేదు. దీంతో జీహెచ్ ఎంసీ, వరంగల్, ఖమ్మం సహా 13 కార్పోరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట సహా 123 మున్సిపాల్టీలకు రిజర్వేషన్లు ప్రకటించారు. రాష్ట్రంలోని 13 కార్పోరేషన్లు యూనిట్ గా తీసుకుంటే ఎస్టీ జనాభా ఒక శాతం కూడా లేదు. కానీ చట్టం ప్రకారం కనీసం ఒక పదవినైనా ఎస్టీలకు రిజర్వ్ చేయాల్సి ఉంది. దీంతో ఒక మేయర్ పీఠం ఎస్టీలకు దక్కింది. ఎస్సీల జనాభా మూడు శాతం ఉన్నందున ఒక మేయర్ పీఠాన్ని ఎస్సీలకు కేటాయించారు. ఎస్టీ, ఎస్సీలకు చెరో ఎనిమిది శాతం రిజర్వేషన్లు మేయర్ పీఠాల్లో దక్కినట్లైంది. దీంతో మిగిలిన రిజర్వేషన్లను బీసీలకు కేటాయించారు. ఆ ప్రకారం బీసీలకు నాలుగు మేయర్ పీఠాలు దక్కాయి. మిగిలిన ఏడు మేయర్ పదవులు జనరల్ కేటగిరీలో ఉన్నాయి. మొత్తం 123 మున్సిపాల్టీల్లో ఎస్సీల జనాభా 3.3శాతంగా తేలింది. దీంతో మున్సిపల్ ఛైర్ పర్సన్ల పదవుల్లో వారికి మూడు శాతం రిజర్వేషన్లు దక్కాయి. ఆ ప్రకారం ఎస్టీలకు నాలుగు ఛైర్ పర్సన్ పదవులు రిజర్వ్ అయ్యాయి. ఎస్సీల జనాభా 13శాతానికి పైగా ఉండడంతో 14శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. దాంతో ఎస్సీలకు 17 మున్సిపల్ చైర్ పర్సన్ పదవులు కేటాయించారు. 50శాతంలో మిగిలిన రిజర్వేషన్ల శాతాన్ని బీసీలకు కేటాయించారు. 33శాతం రిజర్వేషన్ల ప్రాతిపదికన బీసీలకు 40 మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవులు రిజర్వ్ అయ్యాయి. మిగిలిన 62 మున్సిపాల్టీల ఛైర్మన్ల పదవులు జనరల్ కేటగిరీలో ఉన్నాయి.
బైట్ - టి.కె.శ్రీదేవి, పురపాలక శాఖ సంచాలకులు
వాయిస్ ఓవర్ - 02 కార్పోరేషన్లలో జనాభా అవరోహణా క్రమం ప్రకారం మీర్ పేట మేయర్ పీఠం ఎస్టీలకు వచ్చింది. అదే తరహాలో రామగుండం మేయర్ పీఠం ఎస్సీలకు దక్కింది. ఒక్కొక్క సీటు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇక్కడ మహిళలకు ప్రత్యేకంగా రిజర్వ్ చేయలేదు. బీసీలకు బండ్లగూడ జాగీర్, జవహర్ నగర్, నిజామాబాద్, వరంగల్ మేయర్ పీఠాలు దక్కాయి. ఇందులో రెండింటిని మహిళలకు లాటరీ ద్వారా కేటాయించారు. జవహర్ నగర్, నిజామాబాద్ మేయర్ పదవులు మహిళల కోటాకు వెళ్లాయి. ఎస్టీ, ఎస్సీ కోటాలో మహిళకు రిజర్వ్ అవకాశం లేనందున జనరల్ కేటగిరీలోని ఏడు స్థానాల్లో నాలుగింటిని మహిళలకు కేటాయించారు. ఖమ్మం, నిజాంపేట్, బడంగ్ పేట్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠాలు మహిళలకు వెళ్లాయి. కరీంనగర్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ మేయర్ పదవులు జనరల్ లో ఉన్నాయి.
బైట్ - టి.కె.శ్రీదేవి, పురపాలక శాఖ సంచాలకులు
వాయిస్ ఓవర్ - 03 మున్సిపాల్టీల్లో నాలుగు పదవులు మరిపెడ, వర్ధన్నపేట, ఆమన్ గల్, డోర్నకల్ ఎస్టీలకు రిజర్వ్ కాగా... అందులో రెండు ఆమన్ గల్, డోర్నకల్ మహిళలకు దక్కాయి. ఎస్సీలకు రిజర్వ్ అయిన 17 స్థానాల్లో ఎనిమిదింటిని మహిళలకు కేటాయించారు. మధిర, పరకాల, పెబ్బేరు, అలంపూర్, వడ్డేపల్లి, భూపాలపల్లి, పెద్దఅంబర్ పేట స్థానాలు ఎస్సీ మహిళలకు దక్కాయి. క్యాతనపల్లి, బెల్లంపల్లి, ఇబ్రహీంపట్నం, వైరా, నస్పూర్, నేరుడుచెర్ల, తొర్రూరు, నార్సింగి ఎస్సీ జనరల్ కోటాకు వెళ్లాయి. బీసీలకు 40 మున్సిపల్ ఛైర్ పర్సన్ పీఠాలు వెళ్లగా అందులో 20 మహిళలకు కేటాయించారు.
బీసీ మహిళా పదవులు -
సిరిసిల్ల, నారాయణపేట, కోరుట్ల, సదాశివపేట, చండూరు, భీమ్ గల్, ఆర్మూర్, కోస్గి, మెట్ పల్లి, జగిత్యాల, సంగారెడ్డి, భైంసా, మక్తల్, పోచంపల్లి, సుల్తానాబాద్, ధర్మపురి, నర్సంపేట, కొల్లాపూర్, యాదగిరిగుట్ట, బోధన్
బీసీ జనరల్ పదవులు -
నారాయణఖేడ్, ఆందోళ్ - జోగిపేట, గద్వాల, నిర్మల్, రాయికల్, ఎల్లారెడ్డి, మహబూబ్ నగర్, పరిగి, వనపర్తి, అమరచింత, రామాయంపేట, చౌటుప్పల్, కొడంగల్, ఖానాపూర్, తూఫ్రాన్, మంచిర్యాల, బాన్స్ వాడ, ఆలేరు, భువనగిరి, నర్సాపూర్
జనరల్ కోటాలో మొత్తం 62 మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవులుగా ఉండగా... అందులో సగం స్థానాలు 31 పదవులు మహిళలకు దక్కాయి.
జనరల్ మహిళ పదవులు -
చొప్పదండి, పెద్దపల్లి, వేములవాడ, కొత్తకోట, చేర్యాల, దుబ్బాక, మోత్కూర్, ఆత్మకూర్, కామారెడ్డి, తాండూర్, చెన్నూర్, దుండిగల్, జనగాం, నాగర్ కర్నూల్, శంషాబాద్, హుస్నాబాద్, మంథని, హుజూర్ నగర్, హుజూరాబాద్, శంకర్ పల్లి, వికరాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, కొత్తగూడెం, ఘట్ కేసర్, మేడ్చెల్, నందికొండ, తెల్లాపూర్, కోదాడ, తుర్కయాంజల్, గుండ్ల పోచంపల్లి
జనరల్ పదవులు -
హాలియా, మెదక్, దేవరకొండ, గజ్వేల్, జహీరాబాద్, కొత్తపల్లి, ఇల్లందు, అచ్చంపేట, భూత్పూర్, లక్సెట్టిపేట, జమ్మికుంట, కాగజ్ నగర్, నల్గొండ, కల్వకుర్తి, షాద్ నగర్, తుక్కుగూడ, పోచారం, దమ్మాయిగూడ, ఆదిభట్ల, చిట్యాల, ఆదిలాబాద్, అమీన్ పూర్, మహబూబాబాద్, మిర్యాలగూడ, సత్తుపల్లి, కొంపల్లి, నాగారం, తూంకుంట, బొల్లారం, మణికొండ, జల్ పల్లి
బైట్ - టి.కె.శ్రీదేవి, పురపాలక శాఖ సంచాలకులు
ఎండ్ వాయిస్ ఓవర్ - రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసిన పురపాలకశాఖ అందుకు అనుగుణంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. అనంతరం రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికలసంఘానికి నివేదిస్తారు. అటు కొత్త పురపాలక చట్టం ప్రకారం రెండు దఫాలకు ఒకే రిజర్వేషన్ వర్తిస్తుంది. దీంతో ఈ రిజర్వేషన్లే వచ్చే ఎన్నికలకు కూడా వర్తించనున్నాయి.