ETV Bharat / state

Dollar Seshadri died: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం - Dollar Seshadri latest news

Dollar Seshadri died, Dollar Seshadri died with heart attack, Dollar Seshadri Passesaway
డాలర్ శేషాద్రి మృతి, డాలర్ శేషాద్రి కన్నుమూత
author img

By

Published : Nov 29, 2021, 6:59 AM IST

Updated : Nov 29, 2021, 10:26 AM IST

06:53 November 29

Dollar Seshadri dies with heart attack: వేకువజామున గుండెపోటుతో మృతి

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం

Dollar Seshadri Passes away: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న కార్తిక దీపోత్సవంలో పాల్గొనడానికి విశాఖ వెళ్లిన శేషాద్రి.. వేకువజామున 4 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస(Dollar Seshadri dies with heart attack) విడిచారు. హుటాహుటిన రామ్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన మృతి (Dollar Seshadri died) చెందారు. కాసేపటికి ఆయన భౌతికకాయాన్ని అక్కడి నుంచి కేజీహెచ్​కు తరలించారు.

Dollar Seshadri died : 1978 నుంచి శ్రీవారి సేవలో శేషాద్రి తరించారు. 2007లో పదవీ విరమణ చేసినప్పటికీ… ఆయన సేవలను గుర్తించిన తితిదే… ఆలయ ఓఎస్డీగా కొనసాగిస్తూ వస్తోంది. మరణించే చివరి క్షణం వరకు స్వామివారి సేవలో శేషాద్రి తరించారు. డాలర్ శేషాద్రి భౌతికకాయాన్ని విశాఖ నుంచి తిరుపతికి అధికారులు అంబులెన్సులో తరలిస్తున్నారు. మంగళవారం రోజున.. తిరుపతి గోవిందధామంలో ఆయన అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.

డాలర్ శేషాద్రి మరణం తితిదేకు తీరని లోటు అని అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. ఆరోగ్యరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దని తాము సూచించినా… స్వామివారి సేవలో కన్నుమూసినా పర్వాలేదనేవారని గుర్తుచేసుకున్నారు. శ్రీవారి సేవలో తరించడమే తన జీవిత లక్ష్యమనేవారని చెప్పారు. 2013లో శేషాద్రికి కిడ్నీ మార్పిడి జరిగిందని ధర్మారెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: AP Governor News :ఏపీ గవర్నర్ విశ్వభూషణ్​​కు అస్వస్థత.. హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రికి తరలింపు

Last Updated : Nov 29, 2021, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.