హైదరాబాద్ సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరధిలోని మాదన్నపేట రహదారిపై ఉన్న ఎస్‌వై మద్యం దుకాణంలో అర్ధరాత్రి దొంగలు చోరీ చేశారు. మద్యం దుకాణం పైకప్పు గ్యాస్ కట్టర్‌తో విరగగొట్టి దుండగులు దుకాణంలోకి వెళ్లారు. మద్యం బాటిళ్లు, నగదు ఎత్తుకెళ్లారు. అనంతరం సీసీ కెమెరాలను ధ్వంసం చేసి డీవీఆర్‌ను సైతం ఎత్తుకెళ్లారు.
దుకాణం వెనుక భాగం నుంచి వచ్చిన దొంగలు సుమారు రూ. 50 వేల నగదు, ఖరీదైన మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారని వైన్స్ యజమాని నందు పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆధారాలు సేకరిస్తున్నారు.
ఇదీ చూడండి : ఐఎంఎస్ కుంభకోణంలో దేవికారాణి భర్త అరెస్ట్