రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడుతూ ప్రజలకు, పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఓ దొంగను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన రేగుంట భీంరావు అలియాస్ బాలు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడి ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాలుగా మారాడు. గతంలో బెల్లంపల్లిలో ఓ చోరీ కేసులో అరెస్ట్ అయ్యి ఏడాది పాటు జైల్లో ఉండొచ్చినా తీరుమారలేదు. గత నెల 21న హఫీజ్పేట్లో ఓ ఇంట్లో దొంగతనం చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితున్ని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 20 తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్ తెలిపారు.
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్ - manchiryala
రాత్రుళ్లు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఓ పాతనేరస్థున్ని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి 20 తులాల బంగారు, 15 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.50వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.