కరోనా వైరస్ రాష్ట్రంలో విస్తరించకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న ఏడు దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను విమానాశ్రయం నుంచి నేరుగా పరిశీలన కేంద్రానికి పంపిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. పరిశీలనా కేంద్రానికి తరలించినంత మాత్రానా వాళ్లందరికీ కోవిడ్-19 ఉన్నట్లు కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ప్రయాణికులను వికారాబాద్ పరిశీలన కేంద్రంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నామని సజ్జనార్ వెల్లడించారు.
శంషాబాద్‌లోని థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది. మెషిన్ పని విధానాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారిణి అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్‌పై దుష్ప్రచారం చేసే వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు.
ఇదీ చూడండి : 'రాష్ట్ర శాసనసభ సమావేశాలు నిరాశను మిగిల్చాయి'