ETV Bharat / state

టీఎంయూ యూనియన్​లో చీలికలు లేవు: వెంకటేశం - tmu Chief Secretary Ashwatthama reddy latest news

తెలంగాణ మజ్దూర్​ యూనియన్​లో ఎలాంటి చీలికలు లేవని హైదరాబాద్​ జోన్​ టీఎంయూ కార్యదర్శి వెంకటేశం పేర్కొన్నారు. కొంతమంది అసంతృప్తులు వెళ్లినంత మాత్రాన యూనియన్​ చీలిపోయినట్లు కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డిని సమర్థిస్తూ.. టీఎంయూ గ్రేటర్​ హైదరాబాద్​ జోన్​ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని తెలిపారు.

There are no splits in the tmu union
టీఎంయూ యూనియన్​లో చీలికలు లేవు: వెంకటేశం
author img

By

Published : Oct 4, 2020, 6:45 PM IST

తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డిని సమర్థిస్తూ.. టీఎంయూ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని హైదరాబాద్ జోన్ కార్యదర్శి వెంకటేశం పేర్కొన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన టీఎంయూ జీహెచ్ఎంసీ విభాగం సమావేశంలో ఈ మేరకు స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణ, సమ్మె తర్వాత ఆర్టీసీ పరిస్థితి, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో చర్చించారు.

సమ్మె సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గ్రేటర్ జీహెచ్ఎంసీ టీఎంయూ విభాగం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా టీఎంయూ యూనియన్​లో చీలికలు లేవని టీఎంయూ కార్యదర్శి వెంకటేశం పేర్కొన్నారు. కొంతమంది అసంతృప్తులు వెళ్లినంత మాత్రాన.. యూనియన్​ చీలిపోయినట్లు కాదని స్పష్టం చేశారు. కార్యనిర్వాహక అధ్యక్షుడు థామస్​ రెడ్డి తన తప్పు తెలుసుకుని.. మళ్లీ యూనియన్​లోకి రావాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి: లాభాలే లక్ష్యంగా.. ఆర్టీసీ కార్గో పార్శిల్ కొరియర్ సేవలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.