మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధి మల్లంపేటలోని హైరైజ్డ్ మిడోస్ గేటెడ్ కమ్యూనిటీలోని రెండు విల్లాల్లో నిన్నరాత్రి దొంగతనం జరిగింది. శ్రీనివాస్‌కు చెందిన విల్లా నెం 165/B ఇంట్లో 3 తులాల బంగారం, కేజిన్నర వెండి, పదమూడువేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు.
తాళాలు పగులగొట్టి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లూస్ టీం సాయంతో దర్యాప్తు చేపట్టారు.
విశ్వనాథ్ శర్మ విల్లా నెం 143 ఇంటి యజమాని లండన్ వెళ్లడం వల్ల ఏమేమి పోయాయో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. తెలిసిన వ్యక్తులే ఈ చోరీకి పాల్పడి ఉంటారని కాలనీ వారు అనుమానిస్తున్నారు.
ఇవీ చూడండి: పురపోరుకు సై అంటున్న రియల్టర్లు