ETV Bharat / state

బస్తీమే సవాల్: పురపోరుకు సై అంటున్న రియల్టర్లు

రియల్​ ఎస్టేట్​ వ్యాపారాలు బలోపేతం చేసుకోవడానికి.. రాజకీయంగా ఎదగడానికి పురపోరు ఓ మంచి అవకాశమని స్థిరాస్తి వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. దాదాపుగా మహానగరం చూట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో 70 శాతం మంది అభ్యర్థులు వీరే ఉన్నారంటే ఏ మేరకు ఎన్నికల్లో వ్యాపారుల జోరు కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

election candidates of relaters  in Hyderabad
పురపోరుకు సై అంటున్న రియల్టర్లు
author img

By

Published : Jan 11, 2020, 10:42 AM IST

Updated : Jan 11, 2020, 2:53 PM IST

రాష్ట్ర పురపాలక ఎన్నికల్లో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల దూకుడు కొనసాగుతోంది. పురపాలక పదవులను దక్కించుకునేందుకు భారీ సంఖ్యలో స్థిరాస్తి వ్యాపారులు రంగంలోకి దిగారు. పరోక్షంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులకు మద్దతుగా నిలుస్తున్న రియల్టర్లు ఈ సారి ఎన్నికల బరిలో దిగారు. రాజకీయంగా ఎదిగేందుకు... వ్యాపారాలను పదిలం చేసుకునేందుకు ఇదో అవకాశంగా వారు భావిస్తున్నారు. మేయర్‌, ఛైర్‌పర్సన్‌ పదవులు దక్కించుకునేందుకు వందల మంది నామినేషన్లు వేశారు. హైదరాబాద్‌ మహానగరం చుట్టూ ఉన్న ఏడు నగరపాలక సంస్థలు, 21 పురపాలక సంఘాలతో పాటు జిల్లాల్లో కొత్త మున్సిపాలిటీల్లో పదవులపై వీరు ఎక్కువగా దృష్టి సారించారు. ఈ ప్రాంతాల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 70 శాతం మంది వీరే.

కొత్త మున్సిపాలిటీల్లో పోటాపోటీ...

మేయర్‌, ఛైర్‌పర్సన్‌ పదవి కోసం రూ.కోట్లు వ్యయం చేసేందుకు సిద్ధమని స్థిరాస్తి వ్యాపారులు ముందుకు వస్తుండటం వల్ల పార్టీలు వారివైపే మొగ్గుచూపుతున్నాయి. ప్రధానంగా అనుమతులు, వెంచర్లు వేసినపుడు సహా అనేక సందర్భాల్లో ఇబ్బందులు వస్తున్నాయి... తామే పదవి దక్కించుకుంటే వ్యాపారానికి సమస్య ఉండదనే కుటుంబసభ్యులను బరిలో దింపినట్లు శివారు నగరపాలక సంస్థ మేయర్‌ పదవిపై దృష్టిసారించిన స్థిరాస్తి వ్యాపారి తెలిపారు. ఎన్నికల్లో భారీగా వ్యయం చేయాల్సి ఉందని, కొన్ని చోట్ల వార్డులకు రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా కూడా ఖర్చు చేస్తారని, ఇలాంటి పరిస్థితుల్లో స్థిరాస్తి వ్యాపారులు కాకుండా ఇతరులపై ఆధారపడలేమని పార్టీ నేత ఒకరు స్పష్టం చేయడం గమనార్హం. టికెట్‌ దక్కించుకునేందుకే ఏకంగా రూ.85లక్షల వరకు వెచ్చించానని ఓ స్థిరాస్తి వ్యాపారి బాహాటంగా చెబుతుండటం విశేషం.

వ్యాపారుల జోరు ఇలా..

* తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బొల్లారం, సంగారెడ్డిల్లో పలువురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నామినేషన్లు దాఖలు చేశారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, యాదగరిగుట్టలోనూ ఇదే పరిస్థితి ఉంది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని పురపాలక సంఘాల్లో స్థిరాస్తి వ్యాపారులు బరిలో నిలిచారు.
* బోడుప్పల్‌లో 18 మంది స్థిరాస్తి వ్యాపారులు రంగంలోకి దిగారు.
* పీర్జాదిగూడలో స్థిరాస్తి వ్యాపారం చేసే 11 మంది బరిలో నిలిచారు.
* ఆదిభట్లలోఒకే వార్డులో ఇద్దరు రియల్టర్లు పోటీకి సై అంటున్నారు.
* తుక్కుగూడ, పోచారంలో స్థిరాస్తి వ్యాపారులు నిత్యం లక్షల వ్యయంతో విందులతో పోటీపడుతున్నారు.
* మణికొండ, నార్సింగి, బండ్లగూడజాగీర్‌ ప్రాంతాల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో అత్యధికం స్థిరాస్తి వ్యాపారులే ఉన్నారు.
* మేడ్చల్‌ నియోజకవర్గంలోని తూంకుంట మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా 12 మంది రియల్‌ వ్యాపారులు బరిలో నిలిచారు.

ఇదీ చూడండి: 21 వేల 850 నామినేషన్లు.. నేడు పరిశీలన

TG_HYD_14_11_ELECTIONS_REALTERS_PKG_3182400 note: జనరల్ షాట్స్ వాడుకోగలరు ( ) తెలంగాణ రాష్ట్ర పురపాలక ఎన్నికల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు దూకుడు కొనసాగుతోంది. పురపాలక పదవులను దక్కించుకునేందుకు బారీ సంఖ్యలో స్థిరాస్తి వ్యాపారులు రంగంలోకి దిగారు. పరోక్షంగా రాజకీయ నాయకులకు, ప్రజా ప్రతినిదులకు మద్దతుగా నిలుస్తున్న రియల్టర్లు ఈ సారి ఎన్నికల బరిలో దిగారు. మేయర్, చైర్‌పర్సన్ పదవులు దట్కంచుకునేందుకు వందలమంది నామినేషన్లు వేశారు. హైదరాబాద్ మహానగరం చుట్టూ కొత్తగా ఏర్పాటైన నగరపాలక సంస్థలు , పురపాలక సంఘాలతో పాటు జిల్లాల్లో కొత్త మున్సిపాలిటీల్లో పదపులపై ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు దృష్టి సారించారు . ఆర్థబలం ఉన్న అభ్యర్థుల కోసం పార్టీలు చూస్తుండగా అత్యధికం రియల్టర్లే ముందుకు రావడంతో పార్టీలు కూడా వీరిపట్ల మొగ్గు చూపుతున్నాయి. వాయిస్ మేయర్ , చైర్పర్సన్ పదవి కోసం కోట్ల రూపాయలు వ్యయం చేసేందుకు సిద్ధమని స్థిరాస్తి వ్యాపారులు ముందుకు వస్తుండటంతో పార్టీలకు సులువుగా మారింది. రాష్ట్రంలో 120 పురపాలక సంఘాలు, పది నగరపాలక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో భారీ సంఖ్యలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు నామినేషన్లను వేశారు . రాజకీయంగా ఎదిగేందుకు...వ్యాపారాలను పదిలం చేసుకునేందుకు బరిలో దిగారు. హైదరాబాద్ శివారులో ఏడు కార్పొరేషన్లు , 21 మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రధాన పార్టీ తరపున పోటీలో నిలిచిన అభ్యర్థుల్లో 70 శాతం మంది రియల్ వ్యాపారులే ఉన్నారు. రియల్ వ్యాపారుల్లో అత్యధికం ప్రధాన పార్టీల నుంచి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏదో ఒక పదవి దక్కించుకుంటే ఐదేళ్ల వరకు డోకా ఉండదని చెబుతున్నారు. కొత్త పురపాలక సంఘాల్లో పోటాపోటీ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్త జిల్లా కేంద్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. కొత్తగా 58 పురపాలక సంఘాలు ఏర్పాటుతో వాటిలో భారీగా స్థిరాస్తి వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ జోరు కొనసాగుతుండటంతో స్థిరాస్తి వ్యాపారులు పలువురు కొత్తగా తెరపైకి వచ్చారు. దీంతో కొత్త పాత స్థిరాస్తి వ్యాపారులు రాజకీయంగా సత్తా చాటేందుకు పదవులను దక్కించుకునేందుకు రంగంలోకి వచ్చారు పడవులతో వ్యాపారం పదిలమని రాజకీయంగా పదవులు అది కూడా పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఉంటే స్థిరాస్తి వ్యాపారానికి తోడుగా ఉంటుందని పలువురు బరిలోకి దిగుతున్నారు. రిజర్వేషన్ల పరంగా అవకాశం లేని చోట కుటుంబసభ్యులను పోటీకి దింపుతున్నారు. ప్రతిసారి ఎన్నికల సమయంలో అభ్యర్థులకు డబ్బులు ఇవ్వడం సాధారణంగా మారిందని, గెలిచిన తర్వాత కూడా డబ్బులు వ్యయం చేయండే పనులు కావడం లేదని బరిలో నిలిచిన స్థిరాస్తే వ్యాపారి అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో భారీగా వ్యయం చేయాల్సి ఉంది . కొన్ని చోట్ల వార్డులకు 21 లక్షల నుంచి 50 లక్షల దాకా కూడా వ్యయం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో స్థిరాస్తి వ్యాపారులు కాకుండా ఇతరులపై ఆధారపడలేమని పార్టీ నేత ఒకరు స్పష్టం చేయడం గమనార్హం. హైదరాబాద్ సమీపంలో కొత్తగా ఏర్పాటైన నగరపాలక సంస్థ జనరలకు రిజర్వ్ కాగా ఈ మేయర్ పదవికోసం రెండున్నర కోట్ల రూపాయలు వ్యయం చేసేందుకు స్థిరాస్తి వ్యాపారి ముందుకు రావడం విశేషం. హైదరాబాద్ నగరం చుట్టూ కొన్నేళ్లుగా స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. మూడేళ్లుగా స్థలాల రేట్లకు రెక్కలొచ్చాయి. శివారులో గజం 50వేలు పలుకుతోంది. గతంలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులుగా పనిచేసిన వారు రియల్ వ్యాపారంలోకి ప్రవేశించారు. కొందరు భాగస్వాములతో పాటు సొంతంగా శివారులోని మున్సిపాలిటీల్లో వెంచర్లు వేసి ప్లాట్ల విక్రయాలు చేపట్టి ఆర్థికంగా బలమయ్యారు . వాయిస్ ఏకంగా టికెట్ దక్కించుకునేందుకే రూ . 8 లక్షల వరకు వెచ్చించానని స్థిరాస్తి వ్యాపారులే బాహాటంగా చెబుతుండటం విశేషం. తెల్లాపూర్, అమీన్‌పూర్, బొల్లారం , సంగారెడ్డిలో పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నామినేషన్లు దాఖలు చేశారు. విలీన గ్రామాలు, కొత్త పురపాలక సంఘాల్లోని రియల్ వ్యాపారులు ఈసారి వార్డుల పదవులను దక్కించుకునేందుకు రంగంలోకి దిగారు. సూర్యాపేట , కోదాడ , హూజూర్ నగర్, యాదగరిగుట్టలోనూ ఇదే పరిస్థితి ఉంది. నిజామాబాద్ , కామారెడ్డి జిల్లాల్లో పురపాలక సంఘాల్లో స్థిరాస్తి వ్యాపారులు బరిలో నిలిచారు . బోడుప్పల్లో 18 మంది స్థిరాస్తి వ్యాపారులు ఈసారి రంగంలోకి దిగారు. ఫిర్జాదిగూడలో 11 మంది బరిలో నిలిచారు. ఒక్కొక్క డివిజన్లో 50లక్షలు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారు . నిజాంపేట రియల్ వ్యాపారులు పోటీలో సై అంటే సై అంటున్నారు . రియల్టర్ స్వయంగా ఎన్నికల బరిలో దిగగా, మరో బిల్డర్ బావమరిదిని పోటీకి సిద్ధం చేశారు. మరో బిల్డర్ తన కుమారుడికి టికెట్ ఇప్పించుకుని రాజకీయంగా కొడుకు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు . ఆదిభట్లలో ఒక వార్డులో ఇద్దరు రియల్టర్లు పోటీకి సై అంటే సై అంటున్నారు . తుక్కుగూడ, పోచారంలో స్థిరాస్తి వ్యాపారులు నిత్యం లక్షల వ్యయంతో విందులతో పోటీపడుతున్నారు . మణికొండ, నార్సింగి, బండ్లగూడడాగర్ ప్రాంతాల్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో అత్యధికం స్థిరాస్తి వ్యాపారులే ఉన్నారు. బండ్లగూడ కార్పొరేషన్లో కొందరు ఏకంగా కోటి వరకు పెట్టడానికి సిద్ధమని పార్టీలకు స్పష్టం చేస్తున్నారు . మేడ్చల్ నియోజకవర్గంలోని తూంకుంట మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా 12 మంది రియల్ వ్యాపారులు బరిలో నిలిచారు.
Last Updated : Jan 11, 2020, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.