హైదరాబాద్ పంజాగుట్ట పీఎస్ పరిధిలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ముగ్గురు మహిళలు ఉన్న ఇంట్లో చొరబడ్డ దొంగలు... చోరీకి యత్నించారు. మహిళలు ప్రతిఘటించడంతో... 55 ఏళ్లు ఓ మహిళపై సత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పంజాగుట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: మూడు వారాలుగా జలసమాధిలోనే ఎమ్మెల్యే సోదరి కుటుంబం!