ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. రెండు నెలల క్రితం కురిసిన వర్షానికి ఆస్పత్రిలోకి మురుగు నీరు చేరింది. ఫలితంగా వెంటనే కూల్చివేసి కొత్త భవనం నిర్మించాలని వైద్యులు ఆందోళన చేపట్టారు.
వెంటనే థియేటర్లను అందుబాటులోకి తేవాలి..
తాజాగా ఆపరేషన్ థియేటర్లో ఆక్సిజన్ పోర్టులు లేవని జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో థియేటర్లు వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. విధులు బహిష్కరించి ఓపి బ్లాక్ ముందు ఆందోళన నిర్వహించారు.
కల్పించకుంటే అత్యవసర సేవలను బంద్ చేస్తాం..
ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించని పక్షంలో అత్యవసర సేవలను సైతం బహిష్కరిస్తామని ఉస్మానియా జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు బైట్రోహిత్ హెచ్చరించారు.
ఇవీ చూడండి : కొవిడ్ మందు పేరుతో పురుగులమందు తండ్రికి తాగించిన కుమారుడు