ETV Bharat / state

వైద్యుల నిర్లక్ష్యమా...? బాధితుల ఆరోపణా..?

అనుకోకుండా నొప్పులొచ్చాయి.. ఆస్పత్రికి వచ్చే సరికే బిడ్డ జన్మించింది. కానీ ఆ పసికందు ప్రాణాలతో పుట్టిందా.. లేక వైద్యం అందక మరణించిందా అనేది సందిగ్ధం. వైద్యుల నిర్లక్ష్యంతోనే బిడ్డ చనిపోయిందని గర్భిణీ తరఫు బంధువులు ఆరోపిస్తుంటే... అసలు వైద్యుల తప్పేమీ లేదంటుంది బాధితురాలు. బుధవారం అర్ధరాత్రి మలక్ పేట ఏరియా ఆస్పత్రి పరిసరాల్లో జరిగిన ఈ ఘటన ఓ మిస్టరీగానే ఉంది.

వైద్యుల నిర్లక్ష్యమా...? బాధితుల ఆరోపణా..?
author img

By

Published : Jul 18, 2019, 9:46 PM IST

Updated : Jul 19, 2019, 12:36 AM IST

బుధవారం రాత్రి సుమారు పది గంటల సమయం... ఓ నిండు గర్భిణీ.. నొప్పులతో ఆస్పత్రికి వస్తూ ... ఆటోలోనే బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డ బతికే ఉందా? చనిపోయిందో తెలియని పరిస్థితి. ఆస్పత్రికి వచ్చిన వెంటనే సిబ్బంది ఆటోలోనే పుట్టిన పసికందు బొడ్డు తాడు కత్తిరించారు. బిడ్డ చనిపోయిందని నిర్ధరించి తల్లికి వైద్యం చేశారు. కానీ వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని బాధితారాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే ఇందులో వైద్యుల తప్పేమి లేదంటుంది బాధితురాలు. అప్పటికే బిడ్డ మృతిచెందినట్లు తెలిపింది. ఆస్పత్రికి వచ్చిన వెంటనే చికిత్స అందిచినట్లు జిల్లా వైద్య అధికారుల విచారణలోనూ తేలింది.

అసలేం జరిగింది

వాస్తవానికి సబ ఫిర్దోసాకి ఏడో నెల. గర్భం ధరించినప్పటి నుంచి మలక్​పేట ఆస్పత్రిలోనే చికిత్స చేయించుకుంటోంది. అప్పటికే ఆమెకు బీపీ ఎక్కువ ఉండటం వల్ల ఈ నెల16న కోఠీ ప్రసూతి వైద్యశాలకు వెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. ఈ మేరకు రిఫరెన్స్ లేఖను కూడా ఇచ్చారు. అయితే కోఠి ఆస్పత్రికి వెళ్లిన సబా... అక్కడ క్యూలైన్లకు భయపడి ఆరోగ్యం సహకరించక పోయినా ఇంటికి వెళ్లిపోయింది. బుధవారం సాయంత్రం నొప్పులు రావటం వల్ల రాత్రి 9గంటలకు మలక్​పేట ఆస్పత్రికి ఆటోలో బయలుదేరింది. తనకు ఆటోలోనే ప్రసవం అయిందని బాధితురాలు చెబుతుంటే ఆమె భర్త మాత్రం వైద్యులు అరగంట ఆలస్యంగా వైద్యం చేయడం వల్ల బిడ్డని కోల్పోవాల్సి వచ్చిందని అంటున్నాడు.

ఎవరు బాధ్యులు

ఈ ఘటనకు కారకులు మీరంటే మీరని అటు వైద్యులు, ఇటు రోగి తరఫు వారు ఆరోపించుకుంటున్నారు. అయితే బాధితురాలు మాత్రం వైద్యులు చెప్పిందే నిజమని చెప్పడం గమనార్హం. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన జిల్లా వైద్య అధికారులు కూడా ఇదే విషయం తేల్చినట్లు సమాచారం. కావాలనే ఆస్పత్రిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని సిబ్బంది అంటున్నారు.

వైద్యుల నిర్లక్ష్యమా...? బాధితుల ఆరోపణా..?

ఇదీ చూడండి: 'వైద్యుల నిర్లక్ష్యంతోనే మా బిడ్డ చనిపోయింది'

Intro:Body:Conclusion:
Last Updated : Jul 19, 2019, 12:36 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.