తొలి విడత ఇంజినీరింగ్ సీట్లను ఈ నెల 10న కేటాయించనున్నారు. కన్వీనర్ కోటా సీట్ల కోసం 53 వేల 890 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. వారిలో నిన్నటి వరకు 38 వేల 495 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ నేటితో ముగియనుంది. మొదటి విడత సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 10 నుంచి 15వరకు ఆన్‌లైన్‌లో బోధన రుసుము చెల్లించి సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయాలని కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.
ఈనెల 11 నుంచి ఈసెట్
ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో పాలిటెక్నిక్ డిప్లొమో హోల్డర్లు చేరేందుకు నిర్వహించిన ఈసెట్ రెండో విడత ప్రవేశాల ప్రక్రియ ఈనెల 11న ప్రారంభం కానుంది. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులకు ఈ నెల 11న రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. గతంలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకాని వారు 12వ తేదీన హాజరు కావచ్చు. ఈనెల 12, 13న వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఈనెల 15న రెండో విడత సీట్లను కేటాయించనున్నారు.
ఇవీ చూడండి: అన్నారం బ్యారెజీకి అమృతధారలు