తాగునీరు అందించడం అంటే ప్రజలకు సేవ చేసే అదృష్టంగా భావించాలని జలమండలి ఎండీ దాన కిషోర్ అన్నారు. జలమండలిలో ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన 93 మంది మేనేజర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయం నుంచి ఎండీ దానకిషోర్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.
జలమండలిలో వివిధ విభాగాల పనితీరుపై వివరించి చెప్పారు. మేనేజర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ వద్దకు వచ్చిన సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించాలని తెలిపారు. అత్యంత బాధ్యతతో కష్టపడి విధులు నిర్వర్తిస్తూ బోర్డుకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఇవాళ్టి నుంచి వారం పాటు జూమ్ ద్వారా వర్చువల్ పద్ధతిలో శిక్షణ నిర్వహించనున్నారు.