ETV Bharat / state

రైలు సిగ్నల్ కట్​ చేస్తారు.. రాళ్లవర్షం కురిపిస్తారు.. ఆపై! - పార్థీ గ్యాంగ్​పై తాజా వార్తలు

రాత్రి వేళ కాపు కాసి రైల్వే సిగ్నల్​ వైర్లను కట్ చేస్తారు. ఒక్కసారిగా రైలు బోగీలపై  రాళ్ల వర్షం కురిపిస్తారు. బోగీ పక్కన ఒకరిపై ఒకరు నిచ్చెనలా నిలబడి నిద్రిస్తున్న మహిళల మెడల్లో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తారు. ప్రతిఘటించిన వారిని కత్తితో బెదిరిస్తారు. ఎదురిస్తే దాడికి తెగబడతారు. వీళ్లంతా ఎవరనుకుంటున్నారా... వాళ్లే పార్ధీ గ్యాంగ్​ ముఠా.

the-train-signal-will-be-cut-the-rain-will-fall-and-then
రైలు సిగ్నల్ కట్​ చేస్తారు.. రాళ్లవర్షం కురిపిస్తారు.. ఆపై!
author img

By

Published : Dec 10, 2019, 3:40 PM IST

పార్థీ గ్యాంగ్.. ఈ మధ్య కాలంలో ఈ పేరు వినని వారు లేరనడం అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఇళ్లల్లో, రైళ్లలో వరుస చోరీలకు పాల్పడి.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది ఈ ముఠా. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులోకి వచ్చిన 'వేర్​ ఈజ్​ మై ట్రేన్​' యాప్​ను ప్రధాన ఆయుధంగా మలుచుకుని దోపీడీలకు పాల్పడుతున్న ఈ ముఠాలో మొత్తం 9 మంది సభ్యులు ఉన్నారు. వీరు రాత్రి వేళలో రైలు ప్రయాణిస్తున్న మార్గంలో కాపుకాసి.. నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న రైల్వే సిగ్నల్ వైరును కత్తిరిస్తారు. దీంతో గ్రీన్​సిగ్నల్​కు బదులుగా రెడ్​ సిగ్నల్ పడుతుంది.

కత్తులతో బెదిరించి...
ఫలితంగా రైలు నిలిచిపోగానే నిందితులు బోగీలపై రాళ్ళ వర్షం కురిపిస్తారు. మరికొంత మంది రైలు బోగీల పక్కన ఒకరిపై ఒకరు నిలబడి.. నిద్రిస్తున్న మహిళా ప్రయాణికుల మెడలో నుంచి ఆభరణాలు దొంగిలిస్తారు. ప్రతిఘటించిన వారిని కత్తులతో బెదిరిస్తారు. ఎదురుతిరిగితే దాడికి తెగబడతారు.

ప్రయాణికులకు గాయాలు...
మహారాష్ట్రకు చెందిన ఈ ముఠా సభ్యులు గత సెప్టెంబర్​లో మహబూబ్​నగర్, దివిటిపల్లి, కౌకుంట్ల రైల్వే స్టేషన్ల వద్ద వరుసగా ఏడు దోపీడీలు చేసి పోలీసులను ఉరుకులు పెట్టించారు. యశ్వంత్​పూర్ ఎక్స్​ప్రెస్, జబల్​పూర్ ఎక్స్​ప్రెస్​లలో దోపీడీలకు పాల్పడినపుడు చేసిన రాళ్ళదాడిలో కొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రత్యేక బృందం ఏర్పాటు...

ఇలా వరుస దోపిడీలకు పాల్పడుతున్న వీరిపై రైల్వే పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. రైల్వే అదనపు డీజీ సందీప్ శాండిల్యా ఆదేశాలతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి.. ఈ ముఠాకు చెందిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. తప్పించుకు తిరుగుతున్న ప్రధాన నిందితుడు అవినాశ్ శ్రీరామ్​ కాలే​ తన స్నేహితుడిని కలిసేందుకు నగరానికి వచ్చాడన్న పక్కా సమాచారంతో సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రెండు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మిగిలిన మరో నిందితుడిని సైతం త్వరలోనే అరెస్టు చేస్తామని సికింద్రాబాద్​ రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు.

రైలు సిగ్నల్ కట్​ చేస్తారు.. రాళ్లవర్షం కురిపిస్తారు.. ఆపై!

ఇదీ చూడండి : చెట్టును ఢీ కొట్టాడు... జరిమానా కట్టాడు..

TG_HYD_02_10_RAILWAY_PARDHI_GANG_PKG_3182400_TS10120 రిపోర్టర్ నాగార్జున note: దొంగలు ఒకరిపై ఒకరు నిచ్చెనలా నిలబడిన ఫోటో డెస్క్ వాట్సప్ కి పంపాము (బిజీ కూడా వాడుకోవచ్చు). రైల్వే ఫైల్ విజువల్స్ ftp నుంచి వచ్చాయి.. ఎస్పీ బైట్ TG_HYD_02_10_RAILWAY_PARDHI_GANG_PKG_3182400_TS10120 ఈ ఫైల్ నేమ్ తో వచ్చింది. ( ) సిగ్నల్ కట్ చేస్తారు...రైలు బోగీ లపై రాళ్ళ దాడి చేస్తారు..బోగీ ప్రక్కన ఒకరిపై ఒకరు నిచ్చెనలా నిలబడి నిద్రిస్తున్న ప్రయాణికుల, మహిళల మెడలలో నుంచి బంగారు ఆభరణాలు...చోరీ చేస్తారు...ఇలా రైల్వే ప్రయాణికులన వణికించిన పార్థి గ్యాంగ్ లోన ప్రధాన నిందితుడిని రైల్వే పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తర్చాడుతున్నాడన్న పక్కా సమాచారంతో ఈ ముఠా లో ప్రధాన నేరస్తుడిని రైల్వే పోలీసుల అరెస్ట్ చేశారు. 9 మంది ముఠా సభ్యులపై నిఘా పెట్టిన పోలీసులు గతంలో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. తప్పించుకు తిరుగుతున్న అవినాష్ శ్రీరామ్ కాలే ను కూడా అరెస్ట్ చేయడంతో రైళ్ళలో దోపిడీలు చాలా వరకూ తగ్గాయి. వాయిస్ పార్థీ గ్యాంగ్.. ఈ పేరు వినని వాళ్ళే ఉండరు ఇళ్ళల్లో రైళ్ళలో వరుస చోరీలకు పాల్పడి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. నిందుతులు చోరీ చేస్తున్న విధానం చూసి పోలీసులే విస్తుపోయారు....వేర్ ఈజ్ మై ట్రైన్ .......రైల్వే ప్రయాణికులకు ఈ యాప్ అందుబాటులోకి వచ్చాక ఎంతో సౌకర్యంగా ఉంది...రైలు ఎక్కడ ఉంది..ఎంత దూరంలో ఉంది...అనే అన్నిసదుపాయాలు ఉన్నాయి...అయితే పార్థి గ్యాంగ్ దీన్నే ఆయుధంగా ఎంచుకున్నారు..రైలు ప్రయాణిస్తున్న మార్గంలో రాత్రివేళ్ళలో దారి కాచి...నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న సిగ్నల్ వైరును కత్తిరిస్తారు..రెడ్ సిగ్నల్ పడటంతో రైలును నిలిచిపోతుంది....దీంతో ఒక్కసారిగా బోగీలపై రాళ్ళ వర్షం కురిపిస్తారు...మరికొంత మంది...ఒక్కరిపై ఒకరు నిలబడి...రైలు కిటికీల గుండా నిద్రిస్తున్న మహిళా ప్రయాణికుల మెడలోనుంచి అభరణాలు దొంగలిస్తారు. ఇవవ్వకపోతే చంపేస్తాం అంటూ కత్తులతో బెదిరిస్తారు...ఎదురు తిరిగితే దాడికి తెగబడతారు..ఇలా వరుస దోపిడీలకు పాల్పడుతున్న వీరిపై రైల్వే పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు... బైట్ : అనురాధ, సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ వాయిస్ గత సెప్టెంబర్ లో మహరాష్ట్రకు చెందిన ఈ గ్యాంగ్ మహబూబ్ నగర్ దివిటిపల్లి రైల్వేస్టేషన్, కౌకుంట్ల రైల్వే స్టేషన్ల వద్ద వరుసగా ఏడు దోపీడీలు చేసి పోలీసులను ఉరుకులు పెట్టించింది. యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్, జబల్ పూర్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ళదారి చేసి దోపిడీకి పాల్పడిన ఈ ముఠా దాడిలో కొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు..దీంతో రైల్వే అదనపు డీజీ సందీప్ శాండిల్యా ఆదేశాలతో ప్రత్యాక బృందం ఏర్పాటు చేసి ఈ ముఠాలో ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. అప్పటినుంచి చాలా నేరాలు తగ్గిపోయాయి..తాజాగా తప్పించుకు తిరుగుతున్న ప్రధాన నిందితుడు అవినాష్ తన స్నేహితుడిని కలిసేందుకు సికింద్రాబాద్ వచ్చాన్న సమాచారంతో రైల్వే స్టేషన్ లో అతడిని అరెస్ట్ చేశారు.అతని వద్ద నుంచి రెండు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో గ్యాంగ్ కి రైల్వే పోలీసులు చెక్ పెట్టారు... బైట్: అనురాధ, సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ ఎండ్ వాయిస్ మహరాష్ట్ర కు చెంది ఈ గ్యాంగ్ చోరీ చేసీ తమ స్వగ్రాలకు వెళ్ళి జల్సాలు చేసుకుంటారు...ఒక వేళ అరెస్ట్ చేయడానిక పోలీసులు ఆ గ్రామంలో అడుగుపెడితే అంతే సంగతులు...రాళ్ళ వర్షం కురిపిస్తారు..దీంతో పోలీసులు నిందితుల కోసం ఆగ్రామనికి వెళ్ళాలంటేనే జంకుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.