ETV Bharat / state

Liquor stores in telangana: డిసెంబర్‌ నుంచి అమలులోకి నూతన మద్యం విధానం - తెలంగాణ వార్తలు

Liquor stores in telangana, Telangana wine shops
రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలు పెంపు, తెలంగాణలో మద్యం దుకాణాలు
author img

By

Published : Nov 8, 2021, 5:32 PM IST

Updated : Nov 8, 2021, 6:51 PM IST

17:29 November 08

రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలు పెంపు

రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలు పెంచుతూ(Liquor stores in telangana) ఆబ్కారీ శాఖ నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల సంఖ్య 2,216 నుంచి 2,620కి పెంచింది. డిసెంబర్‌ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుందని ప్రకటించింది. నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు రేపటి నుంచి ఈ నెల 18 వరకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో ఈనెల 20న డ్రా ద్వారా లైసెన్సుల ఎంపిక ప్రక్రియ పూర్తి కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు రిజర్వేషన్ల ప్రకారం ఇవాళ మద్యం దుకాణాల కేటాయింపు(Liquor reservation in telangana) ప్రక్రియ పూర్తి చేసింది. కమిటీ సభ్యులతోపాటు ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్లు, ఇతర అధికారుల సమక్షంలో డ్రా ద్వారా గౌడ్‌లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 లెక్కన దుకాణాలు కేటాయించినట్లు తెలిపింది. ఈ మూడు క్యాటిగిరీలకు 756 మద్యం దుకాణాలు కేటాయించినట్లు వెల్లడించిన ఆబ్కారీ శాఖ... మిగిలిన 1,864 మద్యం దుకాణాలు(Liquor stores in telangana) ఓపెన్‌ క్యాటగిరి కింద ఉన్నట్లు స్పష్టం చేసింది.  

ఆర్థిక పరిపుష్టి కోసమే..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గౌడ్, ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా పరిపుష్టి సాధించేందుకు మద్యం దుకాణాలను(Liquor stores in telangana) లాటరీ ద్వారా  కేటాయించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాల్లో గౌడ్​లకు 15 శాతం (363), ఎస్సీలకు 10 శాతం (262), ఎస్టీలకు 5శాతం (131) రిజర్వేషన్ల(Liquor reservation in telangana) ప్రకారం కేటాయించినట్లు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లో లాటరీ ద్వారా మద్యం దుకాణాల రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాలకు సంబంధించిన గౌడ్, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 90 ఉండగా... వాటిలో రిజర్వేషన్ ప్రకారం ఎస్టీలకు 3, ఎస్సీలకు 10, గౌడ్​లకు 14 కేటాయించారు. మిగిలినవి ఓపెన్ కేటగిరీలో కేటాయించనున్నారు.

ఆ ఘనత తెరాసదే..           

గౌడ్, ఎస్సీ, ఎస్టీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా మద్యం షాపుల రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి అన్నారు. గతంలో నీరా పథకం తీసుకువచ్చి గౌడ్​లకు అవకాశం కల్పించామని గుర్తు చేశారు. దుకాణాల యజమానులకు ఈసారి వెసలుబాటు  కల్పించామని పేర్కొన్నారు. గతంలో రెండు బ్యాంకులు గ్యారంటీలు  ఇవ్వాల్సి ఉండగా... ఇప్పుడు ఒకటే గ్యారంటీ తీసుకుంటున్నారని మంత్రి వెల్లడించారు. దరఖాస్తు ఫీజు, లైసెన్స్ ఫీజు కూడా పెంచలేదని... ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే మద్యం దుకాణాలు కూడా నామమాత్రంగా పెంచామని తెలిపారు. లైసెన్స్ ఫీజు స్లాబులను 8 నుంచి 12కి పెంచామని  మంత్రి వెల్లడించారు. 

గుడుంబాపై ఉక్కుపాదం

రాష్ట్రంలో  గుడుంబాను ఉక్కుపాదంతో అణచి వేస్తామని... గంజాయిని కూడా అరికడతామని మంత్రి తెలిపారు. అవసరమైతే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. గతంలో యాదవులకు గొర్రెలు, ముదిరాజులకు చేపలు ఉచితంగా ఇచ్చామని... ప్రతి కులం వారు ఆత్మగౌరవంతో బతికేలా చూడటమే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 1000 గురుకులాలను ఏర్పాటు చేశామని చెప్పారు. 

ఇదీ చదవండి: వైన్స్​ కేటాయింపులపై సర్కార్​ మార్గదర్శకాలు.. కలెక్టర్​ నేతృత్వంలో కమిటీలు..

Last Updated : Nov 8, 2021, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.