ETV Bharat / state

జీవ ఔషధ అంకురాలకు ఆసరాగా బయో హబ్​ - బయో హబ్​

రాష్ట్రంలో ఐటీ అంకుర పరిశ్రమలు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన టీ హబ్‌, వీ హబ్‌ల మాదిరే దేశంలో జీవశాస్త్రాలు, ఔషధ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలు, తయారీల కోసం అంకురాలకు ప్రోత్సాహం, వాటి ద్వారా పరిశ్రమలు అభివృద్ధి కోసం కొత్త కేంద్రం బయో హబ్‌ రానుంది. కేంద్రం బయోటెక్నాలజీ శాఖ, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంలో దీన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది.

జీవ ఔషధ అంకురాలకు ఆసరాగా బయో హబ్​
జీవ ఔషధ అంకురాలకు ఆసరాగా బయో హబ్​
author img

By

Published : Oct 5, 2020, 4:26 AM IST

జీవ ఔషధ అంకురాలకు ఆసరాగా బయో హబ్​

జీవ ఔషధ రంగంలో అంకురాల కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో హబ్‌ను ఏర్పాటు చేసి... దాని ద్వారా ఔషధరంగాన్ని అభివృద్ధి పరచాలని భావిస్తోంది. దేశంలో మొట్టమొదటిసారిగా ఔషధరంగానికి ప్రత్యేక హబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలంలోని జీనోమ్‌వ్యాలీలోని కొల్లూరు, లాల్‌గడిమలక్‌పేట గ్రామాల మధ్య 2.7 ఎకరాల విస్తీర్ణంలో 60 కోట్ల 37 లక్షలతో దీన్ని నిర్మించనున్నారు. ఆకృతి, నిర్మాణం, నిర్వహణ, అప్పగింత ప్రాతిపదికన ప్రముఖ సంస్థల నుంచి ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది.

ఔషధాల ఉత్పత్తిలో మొదటి స్థానం

జీవశాస్త్రాల రంగంలో భారత్‌ ఇప్పుడు ప్రముఖ స్థానంలో ఉంది. ప్రపంచంలో వినియోగంలో ఉన్న టీకాల్లో 62 శాతం, ఔషధాల్లో 20 శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. భారతీయ ఔషధరంగ మార్కెట్‌ విలువ ప్రస్తుతమున్న 4 లక్షల కోట్ల నుంచి 2025 నాటికి 7.5 లక్షల కోట్లకు చేరనుంది. కరోనా మహమ్మారి నిర్మూలనకు ఉద్దేశించిన టీకాల తయారీలో భారత్‌కు చెందిన ఏడు సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. 800 ఔషధ పరిశ్రమలతో తెలంగాణ దేశంలోనే ఔషధాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. 40 శాతం ఔషధాలు ఇక్కడే ఉత్పత్తవుతున్నాయి. ఔషధ రంగంలో అతిపెద్ద సమూహంగా 19 వేల ఎకరాల్లో హైదరాబాద్‌ ఔషధనగరిని ఏర్పాటు చేయడానికి తెలంగాణ సన్నద్ధమవుతోంది.

భాగస్వామిగా కేంద్ర బయోటెక్నాలజీ శాఖ

జీవఔషధ రంగంలో ఆవిష్కరణలు వెల్లువెత్తుతున్నాయి. అంకుర పరిశ్రమలు, కొత్త సంస్థలు పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నాయి. వీటిని ప్రోత్సహించి, నిలదొక్కుకునేందుకు వీలుగా చేయూతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన బయో ఏసియా సదస్సులో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అంకుర పరిశ్రమల కోసం బీహబ్‌ను నిర్మిస్తామని ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వినతి మేరకు కేంద్ర బయోటెక్నాలజీ శాఖ భాగస్వామిగా చేరేందుకు ముందుకొచ్చింది.

మొదటి దశలో 40 వేల చదరపు అడుగుల్లో భవనాలు

ఈ కేంద్రంలో పరిశోధన, ప్రయోగశాలలతో పాటు ఇంక్యుబేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. నూతన ఆవిష్కరణలకు వేదికగా దీనిని ఉపయోగిస్తారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో బయోటెక్‌ హబ్‌ లిమిటెడ్‌ పేరిట ప్రత్యేక ప్రయోజన వాహక సంస్థ ఎస్‌పీవీ ద్వారా దీనిని నిర్వహిస్తారు. టీఎస్‌ఐఐసీ దీని నమూనాను రూపొందించింది. మొదటి దశలో 40 వేల చదరపు అడుగుల్లో భవనాలను నిర్మిస్తారు. ఇందులో 25 వేల చదరపు అడుగులను ప్రయోగశాలలకు కేటాయిస్తారు. 10 వేల చదరపు అడుగులను 200 అంకుర పరిశ్రమల ఉత్పత్తులకు, 5000 చదరపు అడుగులను ఉమ్మడి సౌకర్యాలకు కేటాయిస్తారు.

150కి పైగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు

దేశంలోని మొట్టమొదటి పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా నిర్మించిన జీనోమ్‌వ్యాలీ ప్రపంచప్రసిద్ధి పొందింది. 150కి పైగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇందులో పరిశోధనలు, ఉత్పత్తులు చేస్తున్నాయి. ఈ వ్యాలీని విస్తరించి, 247 ఎకరాల్లో రెండో దశను ఏర్పాటు చేస్తున్న రాష్ట్రం ప్రభుత్వం..... అందులో బీహబ్‌ను నిర్మించడం వల్ల అంకుర సంస్థలకు ప్రయోజనకరంగా ఉంటుందని అంచనా వేస్తోంది.

ఇదీ చదవండి: 'బాగా పనిచేస్తే దుబ్బాక స్థానం కాంగ్రెస్​దే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.