కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ... రైతుల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈనెల పదోతేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లాల వారీగా సీనియర్ నాయకులను బాధ్యులుగా నియమించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మహబూబ్నగర్లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆయనతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు కొత్వాల్ హాజరుకానున్నారు.
ఎవరెవరు ఎక్కడెక్కడంటే...
నల్గొండలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి, వెంకట్ రెడ్డి, జానారెడ్డి హాజరవుతుండగా... ఖమ్మంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రేణుక చౌదరి, సంభాని చంద్ర శేఖర్ పాల్గొంటారు. మల్కాజిగిరిలో ఎంపీ, టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కరీంనగర్లో పొన్నం ప్రభాకర్, జగిత్యాలలో జీవన్ రెడ్డి, సిరిసిల్లలో పొన్నాల లక్ష్మయ్య, సంగారెడ్డిలో జెట్టి కుసుమ కుమార్, ఎమ్యెల్యే జగ్గారెడ్డి హాజరవుతారు. సిద్దిపేటలో దామోదర్ రాజ నర్సింహా, ములుగులో సీతక్క, రంగారెడ్డిలో కొండా విశ్వేశ్వరరెడ్డి, జనగామలో దాసోజు శ్రవణ్, నాగర్ కర్నూలులో మల్లు రవి, భూపాలపల్లిలో శ్రీధర్ బాబు హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చూడండి: 'దుబ్బాకలో పెద్దఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు'