రాష్ట్రంలోని అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును ఈనెల 20 వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ దృష్ట్యా ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించినట్టు ఉన్నత మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఎంసెట్, ఈసెట్, లాసెట్, పీజీఎల్ సెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీఈసెట్ తదితర రాష్ట్ర ప్రవేశ పరీక్షలన్నింటికీ ఈ గడువు పొడిగింపు వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చూడండి: షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం, తల్లీకుమార్తె సజీవదహనం