భూవివాదాలపై ఏర్పాటైన ప్రత్యేక ట్రైబ్యునళ్లు ఇచ్చిన తీర్పులపై అభ్యంతరాలు ఉన్న వారు తమ వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆయా పార్టీలకు అవకాశం కల్పించాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఈ నెల 15, 16 తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలని రెవెన్యూశాఖ తెలిపింది. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా విచారణ తేదీలను 19వ తేదీన ట్రైబ్యునళ్లు ప్రకటించనున్నాయి.
విచారణ సమయంలో ఆయా వర్గాలు లేదా వారి తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించవచ్చని లేదా లిఖితపూర్వకంగా ఇవ్వవచ్చని రెవెన్యూశాఖ తెలిపింది. ప్రక్రియను ఆలస్యం చేసేలా వ్యవహరించవద్దని పేర్కొంది. ఈ తేదీల తర్వాత ట్రైబ్యునళ్లు ఇచ్చే తీర్పులను మళ్లీ తెరిచే అవకాశం ఉండబోదని రెవెన్యూశాఖ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బందికి సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్